సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, రైతుల రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోమని కాంగ్రెస్ సర్కార్‌ను హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలి. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం కరెక్ట్ కాదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
మూసీ ప్రక్షాళన కోసం రూ.లక్షా 50వేల కోట్లు అంటున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతు భరోసాకి, దొడ్డు వడ్ల బోనస్‌కు పైసలు లేవా?. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోం. వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసేలేదు. మీ ముడుపుల మూసీ కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఉంటాయి కానీ.. రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా?. ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి రైతులకిచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం’ అంటూ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment