
సాక్షి, వనపర్తి : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు వనపర్తిలోని ఆమె స్వగృహానికి చేరుకున్నారు. కాగా, తారకమ్మ అంత్యక్రియలు నేడు సాయంత్రం స్వగ్రామంలో జరగనున్నట్టుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment