
రామ్ గౌడ, ప్రియాపాల్ జంటగా నూతన చిత్రం ప్రారంభమైంది. వి.జె సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీఆర్ ప్రొడక్షన్ పతాకంపై రవి సాగర్ నిర్మిస్తున్నాడు. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హీరోహీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా రవి సాగర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ....నువ్వు గొప్పగా కల కనకపోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు అన్న డైలాగ్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ ఒక్క డైలాగ్ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పకనే చెప్తుందన్నారు. చిత్ర నిర్మాత సి.రవి సాగర్ మాట్లాడుతూ.. 'నేను గత కొంత కాలంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను, ప్రజలందరికీ మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో సి.ఆర్ అనే ఒక బ్రాండ్‌తో విషం లేనటువంటి మంచి ఆహారాన్ని సమాజానికి అందిస్తూ అదే పంథాలో ఇప్పుడు సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉదేశంతో మీ ముందుకు వస్తున్నాను. పిల్లల్ని మనం హాస్టల్‌లో జాయిన్ చేస్తూ వారికి మనం మంచి విద్యని మాత్రమే ఇస్తున్నాము. కానీ ఎడ్యుకేషన్ తో పాటు చాలా మిస్ అవుతున్నారు, వారు మిస్సయిన ప్రభావం కొంతకాలం తర్వాత అది ఓల్డ్ ఏజ్ హోంగా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనే కంటెంట్ మీద దర్శకుడు వి జె సాగర్ అద్భుతమైన కథ రాసుకున్నారు' అని తెలిపాడు.
దర్శకుడు వి.జె సాగర్ మాట్లాడుతూ.. 'నేను దర్శకత్వ శాఖలో 'తొలిప్రేమ' కరుణాకర్, రసూల్ ఎల్లోర్ దగ్గర పని చేశాను. తర్వాత కొన్ని యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు. ఆ ప్రేమ మిస్ అయితే పెద్దయిన తర్వాత ఎలా తయారవుతారు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాము. కన్నడలో హీరోగా చేసిన రామ్ గౌడ మా సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కేజియఫ్‌కు సంబంధించిన కెమెరా డిపార్ట్‌మెంట్ వారే ఈ సినిమాకు పనిచేస్తున్నారు' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment