నాగర్‌కర్నూల్: ‘కొనుగోలు కేంద్రాల కాడ సగటున 100 మందికి పనివస్తుంది. వానాకాలం, యాసంగిలో రెండున్నర నెలలు ఎవరి పనులు వారు చేసుకుంటూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేసుకునే వెసులుబాటు తెలంగాణలో గ్రామగ్రామాన వచి్చంది. ఇంతకు మించిన ఉపాధి ఏముంది? ఉపాధి అంటే ఇది. సదువుకుంటే సర్కారీ నౌకరి వస్తది.. అయితే, సదువుకున్న అందరికీ సర్కారీ నౌకరి రాదు’అని నిరుద్యోగులను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన ‘దిశ’సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉండి ఉద్యోగాలను తొలగించి, ప్రైవేట్‌పరం చేస్తున్న పారీ్టలు ఇక్కడ ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు చర్చ చేయకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలంటే వీలుపడుతుందా అని ప్రశ్నించారు.
మీడియా వక్రీకరించింది: నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌లో తాను మాట్లాడిన మాటలను మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచింది. ఉద్యోగం అంటేనే ఉపాధి. అది కలి్పంచడం ప్రభుత్వ విధి’ అని తానన్న వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నానన్నట్టుగా ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment