
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి
కవాడిగూడ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 27న వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి, సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సు,ను నిర్వహిస్తున్నట్లు గాంధీ సంస్థల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన 17 స్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని పంటలను ప్రోత్సహిస్తూ వస్తున్నామన్నారు.