ఏపి భవన్లో కిరణ్కు తెలంగాణ సెగ
ఏపీ భవన్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బుధవారం తెలంగాణ సెగ తగిలింది. ముఖ్యమంత్రి తెలంగాణ బిల్లును అడ్డుకోవదంటూ టిటిడిపి నేతలు ఏపీ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలతో ఏపీ భవన్లో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు న్యూఢిల్లీ చేరింది. దాంతో ఆంధ్రప్రదేశ్లోని ఇరు ప్రాంతాల నేతలు న్యూఢిల్లీ చేరి తమ తమ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.