
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. శనివారం ఉదయం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఓటుకు కోట్లు సంబంధించి తాజా పరిణామాలను చర్చిస్తున్నట్టు సమాచారం. మొన్న ఏసీబీ విచారణకు హాజరయిన వేం నరేందర్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితి, వరుసగా తలెత్తుతున్న ఇబ్బందులు, భవిష్యత్ వ్యూహాలపై చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్ రెడ్డితో పాటు గరికపాటి రాంమ్మోహన్రావు, ఎర్రబెల్లి దయాకరరావు, కంభంపాటి తదితరులు చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు.