
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ కొన్ని కారణాల వల్ల కొందరు పార్టీ మారారు. ఆ ఫిరాయింపుల గురించి నేను మాట్లాడను. చెప్పి చేసేది రాజకీయం కాదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. కుటుంబసభ్యుల కన్నా కార్యకర్తలనే ఎక్కువగా ప్రేమిస్తా. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడాలి. ఇక నుంచి తెలంగాణలో పార్టీ కోసం వీలైనంత సమయం కేటాయిస్తా. త్వరలోనే అన్ని కమిటీలను భర్తీ చేస్తాను. బీజేపీతో పొత్తు సందిగ్దంగా ఉంది. అయినా పర్వలేదు. ఎలాంటి వ్యవహారాలతో ముందుకు వెళ్లాలో నేను చూసుకుంటా. టీడీపీ నేతలు సమరం చేయాల్సిన అవసరం లేదు. సమస్యలపై పోరాడితే చాలు’ అని వ్యాఖ్యలు చేశారు. కాగా ఇటీవలే రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment