హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో వివిధ పథకాల కింద పెండింగ్లోని ఇళ్ల నిర్మాణాలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు పరిశీలన చేయనున్నారు. కాగా, ఇప్పటివరకూ డబ్బులు కట్టినా ఇళ్లు మంజూరు కానివారు, ఇల్లు పూర్తైనా బిల్లులు రానివారితో వారు మాట్లాడనున్నారు.