హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో పార్టీలు బుధవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సర్వశిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, ఎన్హెచ్ఆర్సీ నోటీసు అంశంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఐకేపీ, అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై వైఎస్ఆర్ సీపీ, సిరిపూర్ కాగజ్ నగర్, వరంగల్ బిల్డ్ పరిశ్రమ మూసివేతపై సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది.