కేసీఆర్‌ పెట్టే భోజనానికి వెళ్లను | Revanth Reddy Skips TDP Meeting in Golkonda Hotel | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పెట్టే భోజనానికి వెళ్లను

Published Thu, Oct 26 2017 4:40 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

గోల్కొండ హోటల్‌లో కేసీఆర్‌ పెట్టే భోజనానికి తాను వెళ్లదలుచుకోలేదని టీడీపీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ఉదయం టీడీపీ ఆఫీసులో ఉండి సాయంత్రం కేసీఆర్‌ను కలిసేవాళ్లకు తాను జవాబు చెప్పనని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా కేసీఆర్‌పైనే అని తెలిపారు. చంద్రబాబు లేనప్పుడు తనను ఎందుకు పదవుల నుంచి తొలగించారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను స్టార్‌ హోటల్‌లో చర్చించడమేంటని ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement