
'విలీనం చేస్తేనే తెలంగాణ ఇస్తామని చెప్పారా ?'
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విభజన బిల్లు రాష్ట్ర శాసన సభకు వచ్చిన నాటినుంచి అటు తెలంగాణలోనూ, ఇటు సీమాంధ్రలోనూ విభజనపై చర్చ వాడీవేడిగా సాగుతోంది.
మెదక్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విభజన బిల్లు రాష్ట్ర శాసన సభకు వచ్చిన నాటినుంచి అటు తెలంగాణలోనూ, ఇటు సీమాంధ్రలోనూ విభజనపై చర్చ వాడీవేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేత హరీష్రావు తెలంగాణ టీడీపీ నేతల వైఖరిపై మండిపడ్డారు.
తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను విమర్శించడం మానేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును నిలదీయండని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తేనే తెలంగాణ ఇస్తామని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ టీడీపీ నాయకులకు చెప్పారా ? అని హరీష్ రావు ఘాటుగా ప్రశ్నించారు.