
హైదరాబాద్: గోల్కొండ హోటల్‌లో కేసీఆర్ పెట్టే భోజనానికి తాను వెళ్లదలుచుకోలేదని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ఉదయం టీడీపీ ఆఫీసులో ఉండి సాయంత్రం కేసీఆర్‌ను కలిసేవాళ్లకు తాను జవాబు చెప్పనని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా కేసీఆర్‌పైనే అని తెలిపారు. చంద్రబాబు లేనప్పుడు తనను ఎందుకు పదవుల నుంచి తొలగించారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను స్టార్ హోటల్‌లో చర్చించడమేంటని ప్రశ్నించారు.
రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని, దాన్ని వదిలించేందుకు రకరకాల మందులు కొడతామని వ్యాఖ్యానించారు. కాగా, గోల్కొండ హోటల్‌లో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు. ఎల్. రమణ, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి, రామచంద్రరావు భేటీలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment