తెలంగాణ టీడీపీ నేతలు బుధవారం ఉదయం ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.
న్యూఢిల్లీ : తెలంగాణ టీడీపీ నేతలు బుధవారం ఉదయం ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని వారు నినాదాలు చేశారు. పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని టి.టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా లోక్ సభలో అవిశ్వాసం పెట్టాలని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు నిర్ణయించారు.
నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మరోవైపు మరోవైపు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఏపీ భవన్ చేరుకుంటున్నారు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి 21 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.