రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి తెలంగాణ టీడీపీ నేతలు ప్రణబ్ తో భేటీ అయ్యారు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. ఆదివారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల, పెద్దిరెడ్డి, మల్లారెడ్డి ప్రణబ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలోని పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని ప్రణబ్కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో ప్రతిపక్షపార్టీలు ఉండకూడదనే కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. దాంతో ప్రణబ్ తామ ఇచ్చిన వినతిపత్రంపై సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు తెలిపారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో యాదగిరి గుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రమైన యాదాద్రిని రాష్ట్రపతి ప్రణబ్ ఆదివారం దర్శించుకున్న సంగతి తెలిసిందే.