నల్గొండ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఉదయం హెలికాప్టర్లో యాదాద్రి చేరుకున్నారు. ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. స్వామి, అమ్మ వార్లకు రాష్ట్రపతి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవాలయంలో స్వామి వారికి స్వర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మహామండపంలో ప్రణబ్ను వేద పండితులు ఆశీర్వదించనున్నారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2.00 గంటల వరకు దేవాలయంలో సాధారణ, ప్రత్యేక దర్శనాలతోపాటు ఆర్జిత సేవలను నిలిపివేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు యాదాద్రి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రణబ్ వెంట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఉన్నారు.