ప్రజల భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు.
రాష్ట్రపతి ప్రణబ్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. జూలై 3న నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో హరితహారానికి శ్రీకారం చుట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ‘మీ రాక... ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చుతుంది. సమాజం లోని అన్నివర్గాలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేం దుకు దోహదం చేస్తుంది.’ అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నా రు.
కాగా, రాబోయే తరాలు హరితహారం గురించి గొప్ప గా చెప్పుకొంటారని, ప్రభుత్వ పథకాల్లో హరితహారం చరి త్రలో నిలిచిపోతుందని అటవీశాఖ మంత్రి జోగురామన్న చెప్పారు. హరితహారంపై ప్రచారం చేసేందుకు మంగళవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారథి కళాకారులకు శిక్షణ శిబిరంలో మంత్రి మాట్లాడా రు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన కళాకారులు హరితహార ఉద్యమంలో కూడా పాల్గొనాలన్నారు.