నల్గొండ (యాదగిరిగుట్ట) : రాష్ట్రపతి రాక కోసం యాదాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ఈ రోజు గుట్టకు వస్తుండటంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. స్వామి వారిని దర్శించుకోవడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ కూడా రానున్నారు.
ఆయన ఉదయం 11.10 నిముషాలకు హెలికాప్టర్ ద్వారా పడాయిగూడెం చేరుకొని 11.50 నిముషాలకు స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం గుట్టపైన అతిథి గృహంలో విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 12.50 నిముషాలకు తిరుగు ప్రయాణమవుతారు. దేశ ప్రథమ పౌరుడి పర్యటనతో యాదాద్రి పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పాటు జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
నేడు యాదాద్రికి రాష్ట్రపతి
Published Sun, Jul 5 2015 8:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement