వారు ఏపీ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలా?: కేటీఆర్ | KTR slams Telangana TDP members | Sakshi
Sakshi News home page

వారు ఏపీ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలా?: కేటీఆర్

Published Wed, Nov 12 2014 2:35 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM

వారు ఏపీ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలా?: కేటీఆర్ - Sakshi

వారు ఏపీ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలా?: కేటీఆర్

టీడీపీ సభ్యులపై కేటీఆర్ విసుర్లు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీకి ఆంగ్లో ఇండియన్స్‌ను నామినేట్ చేసిన తరహాలో ఆంధ్రప్రదేశ్ కొందరిని నామినేట్ చేసినట్టుంది. వారే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు. సభలో వారి తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది’ అని మంత్రి తారకరామారావు చేసిన వ్యాఖ్య సభలో కాసేపు దుమారం లేపింది. టీఆర్‌ఎస్ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ ప్రసంగిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు కరెంటు రాకుండా చేస్తున్నారని ఈశ్వర్ ఆరోపిస్తున్నపుడు టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
 
 ఆయనకు, టీడీపీ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కేటీఆర్ జోక్యం చేసుకుని, దేశం సభ్యులకు కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ కరెంటు కష్టాలకు సంబంధించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేం దుకు నిన్న సభలో చేసిన తీర్మానంలోని మాటలనే ఈశ్వర్ ఉటంకించారు. అందులో వివాదమేమీ లేదు. ఆ తీర్మానానికి టీడీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. వారి తీరు చూస్తుంటే ఆంగ్లోఇండియన్లను అసెంబ్లీకి నామినేట్ చేసిన తరహాలో ఆంధ్రప్రదేశ్ వీరిని నామినేట్ చేసిందేమోననిపిస్తోంది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement