Anglo-Indians
-
భరత జాతికి ఒక ఆంగ్ల నాడి
‘ఎవరు ఆంగ్లో–ఇండియన్?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం. బ్యారీ ఒబ్రయన్ పుస్తకం దీనికి జవాబు చెబుతుంది. ‘‘ఇండియాకు మొదట వచ్చిన పోర్చుగీసువాళ్లు, ఆ తర్వాత బ్రిటిషర్లు... తమకు విధేయంగా ఉంటూ, తమ వలస పాలన విస్తరణ ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు అవసరమైన సంతతిని ఒక ప్రణాళిక ప్రకారం జాతుల మిశ్రమంతో ఆవిర్భవింపజేశారు’’ అని ఒబ్రయన్ రాశారు. స్వాతంత్య్రానంతరం ఇండియా పాల్గొన్న అనేక యుద్ధాలలో ఆంగ్లో–ఇండియన్లు కీలకమైన పాత్రను పోషించారు. ఇక అందరికీ కచ్చితంగా తెలిసుండే విషయం – మన విద్యారంగంలో, ముఖ్యంగా ఆంగ్ల భాషను బోధించడంలో ఆంగ్లో–ఇండియన్ పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయని! ప్రచురణకర్తలు నాకు కొత్త పుస్తకాలు పంపిన ప్రతిసారీ వాటిలో ఒకటి అమూల్య మైన రత్నం అయి ఉంటుంది. నా వృత్తిపరమైన సంతోషాలలో అదొకటి. తాజాగా నా చేతికి వచ్చిన ‘ది ఆంగ్లో–ఇండియన్స్ : ఏ పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ’ అనే బ్యారీ ఒబ్రయన్ పుస్తకం అటువంటి రత్నమే. పుస్తకం గొప్పగా ఉంది. అయితే కొన్ని చోట్ల సాహితీ శైలి కానటువంటి వివరణాత్మమైన దీర్ఘ సంభాషణలతో సాగుతుంది. అదొక అభిభాషణ... రచయితే నేరుగా మీతో మాట్లాడు తున్నట్లు, మీకు చెప్పడానికి ఇంకా ఎంతో ఉన్నట్లు! ‘‘మొదటొక మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నలే కదా మొదట వేయాలి! తర్వాత మిగతా విషయాలు. సరే, ఏంటంటే... మీరెప్పుడూ కూడా తమిళియన్ అంటే ఎవరు? బిహారీ అంటే ఎవరు? మలయాళీ అంటే ఎవరు? సిక్కులు అంటే ఎవరు? అనే ప్రశ్నల్ని దాదాపుగా విని ఉండరు. అయితే ఆంగ్లో–ఇండియన్ల విషయం పూర్తిగా వేరైనది. ‘ఆంగ్లో–ఇండియన్లు ఎవరు?’ అనే సందేహాన్ని ఒక ప్రశ్నగా మీరే కొన్నిసార్లు వేసుకుని ఉండొచ్చు. నిజం చెప్పాలంటే, ‘ఎవరు ఆంగ్లో–ఇండియన్?’ అనే ప్రశ్న... ‘ఎవరు బెంగాలీ?’ అనే ప్రశ్న కంటే సమాధానం చెప్పడం చాలా కష్టమైన ప్రశ్న’’ అంటారు బ్యారీ ఒబ్రయన్ ఉపోద్ఘాతంగా. గ్రీకు, రోమన్ పురాణాలలో సిరులు పొంగి పొర్లుతుండే ‘కార్నుకోపియా’ కొమ్ము వంటి (మన అక్షయ పాత్ర లాంటిది) ఈ పుస్తకంలో... ఆంగ్లో–ఇండియన్ల గురించిన సమస్త సమాచారమూ గ్రంథస్థమై ఉందా అనిపిస్తుంది కూడా... మనకు తెలిసింది బాగా తక్కువ కనుక! బ్యారీ ఒబ్రయన్ స్వయంగా ఆంగ్లో – ఇండియన్. తన సమూ హపు నాడిపై వేలు ఉంచి ప్రత్యక్షంగా పరిశీలించి చూసినవారు. వారసత్వం, సంస్కృతి, జీవన విధానం, సామాజిక అంశాలలో తన వారి సంపూర్ణ చైతన్యాన్ని లోతుగా పరిశోధించినవారు. ఆయన రాసిన ఈ పుస్తకంలో ఐరోపా సముద్ర శక్తుల ఆగమనం, ఆంగ్లో– ఇండియన్ల అవతరణ, స్వతంత్ర భారత నిర్మాణంలో వారి భాగ స్వామ్యం వంటివి ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఒబ్రయన్ ఆంగ్లో ఇండియన్ అయి ఉండటం ఒక్కటే ఈ పుస్తకానికి ప్రామాణికతను చేకూర్చలేదు. ముప్పై ఏళ్లకు పైగా ఒక సామాజిక కార్యకర్తగా తన సమూహం వ్యవహారాలలో పాల్పంచుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆంగ్లో–ఇండియన్లకు నామినేటెడ్ ప్రతినిధిగా కూడా ఉన్నారు. తన సమూహానికి సంబంధించిన ప్రతి వివరం, ప్రతి విశేషం, గణాంకాలతో సహా ఆయనకు అందుబాటులో ఉంచే విద్యా వంతులైన పరిశోధక విద్యార్థులు ఆయనతో ఉన్నారు. పైగా రచయిత. ఇంకేం కావాలి ఒక అమూల్యమైన పుస్తకం రావడానికి! ఆంగ్లో–ఇండియన్లు అనుకోకుండా, యాదృచ్ఛికమైన కలయిక లతో అవతరించిన ప్రత్యేక సంతతి కానే కాదని ఈ పుస్తకం చదివే వరకు నాకు తెలియదు. వలసవాదులు ఉద్దేశ పూర్వకమైన ప్రయత్నా లతో శ్రద్ధగా అంటుకట్టి వీళ్లను సృష్టించారు. ‘‘ఆంగ్లో – ఇండియన్ల పుట్టుక అప్రమేయమైనది కాదు. ఇండియాకు మొదట వచ్చిన పోర్చు గీసువాళ్లు, ఆ తర్వాత బ్రిటిషర్లు... తమకు విధేయంగా ఉంటూ, తమ వలస పాలన విస్తరణ ప్రక్రియ వేగవంతం అయేందుకు అవసరమైన సంతతిని ఒక ప్రణాళిక ప్రకారం జాతుల మిశ్రమంతో ఆవిర్భవింపజేశారు’’ అని ఒబ్రయన్ రాశారు. నాకు తెలియని మరొక విషయం – స్వాతంత్య్రానంతరం ఇండియా పాల్గొన్న అనేక యుద్ధాలలో ఆంగ్లో–ఇండియన్లు కీలక మైన పాత్రను పోషించారని! ముఖ్యంగా వాళ్లు భారత వైమానిక దళంలో పైలట్లుగా ఉన్నారు. ‘‘1947–48 ఇండో–పాక్ యుద్ధంలో తమ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించిన పైలట్లలో సగంమంది ఆంగ్లో– ఇండియన్లే. 1965, 1971 యుద్ధాలలో గగనతలంలో మెరుపులా ఉరిమిన వారిలోనూ ఆంగ్లో–ఇండియన్లు ఉన్నారు. శత్రువుపై వీరోచితంగా వైమానిక దాడులు జరిపిన ఆనాటి గ్రూప్ కెప్టెన్లలో 20 శాతం మంది, వింగ్ కమాండర్లలో 30 శాతం మంది ఆంగ్లో– ఇండియన్లే’’ అంటారు ఒబ్రయన్. ఇంకా అనేక ఆసక్తికరమైన వివ రాలు పుస్తకంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 0.01 శాతంగా ఉన్న ఆంగ్లో–ఇండియన్లు ఎన్ని యుద్ధ పతకాలు సాధించారో చూడండి. 4 మహావీర చక్ర, 25 వీర చక్ర, 2 కీర్తి చక్ర, 2 శౌర్యచక్ర అవార్డులతో పాటు, 22 వాయుసేన, 13 పరమ విశిష్ట సేవ, 17 అతి విశిష్ట సేవా పతకాలను వీరు సాధించారు! ఆంగ్లో– ఇండియన్లు ఎక్కువగా కోల్‌కతాలో, చెన్నైలలో నివాసం ఏర్పరచుకుని ఉండేవారు. స్వాతంత్య్రానంతరం అరవైలు, డెబ్బైలు, ఎనభైలలో అధిక సంఖ్యలో కలకత్తా నుంచి బ్రిటన్‌కు వెళ్లి స్థిరపడ్డారు. మెరుగైన జీవితం కోసం వారు అటువైపు మళ్లారని అంటారు. ఇప్పుడిక నాకు తెలిసిన విషయం – నేననుకోవడం మీకూ కచ్చి తంగా తెలిసుండే విషయం – మన విద్యారంగంలో, ముఖ్యంగా ఆంగ్ల భాషను బోధించడంలో ఆంగ్లో–ఇండియన్ పాఠశాలలు చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయని! ఆ పాఠశాలల నుంచి ఏ స్థాయిలోని వారు వచ్చారో చూడండి. ఒబ్రయన్ చెబుతున్న దానిని బట్టి... జె.ఆర్.డి. టాటా, సల్మాన్ రష్దీ, ఫరీద్ జకారియా (వీళ్లంతా ముంబైలోని క్యాథడ్రల్ అండ్ జాన్ క్యానన్‌లో విద్యను అభ్యసిం చినవారు), సయీద్ జాఫ్రీ (విన్బెర్గ్ అలెన్, ముస్సోరీ); అమితాబ్ బచ్చన్, కబీర్ బేడీ (షేర్వుడ్ కాలేజ్, నైనితాల్), అరుంధతీ రాయ్ (లారెన్స్, లోవ్డేల్), డాక్టర్ రాజా రామన్న, నందన్ నీలేకని, కిరణ్ మజుందార్ షా (బిషప్ కాటన్, బెంగళూరు), విశ్వనాథన్ ఆనంద్ (సెయింట్ బీడ్స్, చెన్నై) ఆంగ్లో – ఇండియన్లైన టీచర్లు, లెక్చ రర్లు, ప్రొఫెసర్ల దగ్గరే పాఠాలను, అనర్గళమైన ఆంగ్లభాషను నేర్చు కున్నారు. ఇప్పుడు మన దేశంలోని పెద్ద వాళ్లంతా మాట్లాడుతున్నది ఆంగ్లో–ఇండియన్ ఆంగ్లమేనని మనం మర్చిపోకూడదు. ఈ విష యాన్ని రూఢి పరచడానికి ఒబ్రయన్ ప్రముఖ భారతీయ రచయిత ఆలెన్ సీలే మాటల్ని మద్దతుగా తీసుకున్నారు. ‘‘భారతదేశంలో ఆంగ్లభాషను బ్రిటిష్ పాలకులు అధికారికంగా ఏమీ నిర్వీర్యం చేయ లేదు. నిజానికి ఆంగ్లో – ఇండియన్లే ఆ పనిని అనధికారికంగా చేశారు. మెకాలే ఇక్కడ ఆంగ్ల విద్యాబోధనకు పునాదులు వేసినా కూడా బ్రిటిష్ ఇంగ్లిష్ వ్యాప్తి జరగకపోవడానికి కారణం ఆంగ్లో – ఇండియన్లు తమదైన శైలిలో ఆంగ్ల భాషను బోధించడమే.’’ ‘ఆంగ్లో – ఇండియనిజమ్స్’పై ఉన్న అధ్యాయాన్ని చదివి ఉల్లాస భరితుడినయ్యాను. జిగ్గెరీ పోక్ (మోసపూరితమైన లేదా నిజాయితీ లేని ప్రవర్తన), గోయింగ్ ఫర్ ఎ లోఫ్ (సోమరిగా పచార్లు కొట్టడం), గ్యాసింగ్ టూ మచ్ (పొగడ్తలతో ఉబ్బేయడం) అనే పదబంధా లన్నిటినీ ఆంగ్లో–ఇండియన్లే సృష్టించారని ఒబ్రయన్ అంటారు. అది నిజమైనా, కాకున్నా అవి నన్నెంతో ఆకట్టుకున్నాయి. మాట తీరును బట్టి ఆంగ్లో ఇండియన్లను ఇట్టే కనిపెట్టవచ్చని అని కూడా ఆయన చెప్తారు. ‘గివ్–ఎవే’ పదంతో వారు మాటను పూర్తి చేస్తారు. కొందరు ‘నో’ లేదా ‘నా’ అనే పదాన్ని మాటకు కలుపుతారు. మరికొంతమంది అంత్య ప్రత్యయం (సఫిక్స్)గా ‘అప్’ అని గానీ, ‘అండ్ ఆల్’ అని గానీ అంటారు. అత్యంత సాధారణ పదం వచ్చేసి ‘మెన్’. ‘కమ్ ఆన్ మెన్’, ‘నో, మెన్’, ‘ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దిస్ మెన్’ (విసిగిపోయానబ్బా)... ఇటువంటివి. ఒక ఫ్రేజ్ మాత్రం నన్ను నా బాల్యంలోకి లాక్కెళ్లింది. ‘లెటజ్ గో నిన్నీ బైస్’(టు స్లీప్). మా అమ్మపాడిన ఈ లాలిపాట మూలం ఆంగ్లో–ఇండియన్ అని నాకు తెలీదు. ‘నిన్నీ బాబా నిన్నీ / మఖాన్, రోటీ, చిన్నీ / మేరా బాబా సోగయా / మఖాన్, రోటీ హో గయా / నిన్నీ బాబా నిన్నీ’. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
నగరంలో ఆంగ్లో ఇండియన్స్
200 ఏళ్లుగా నగర జీవనంతో మమేకం క్రమేపీ తగ్గుతున్న జనాభా నగరంలో ‘ఆంగ్లో ఇండియన్స్’కు ఓ ప్రత్యేకత ఉంది. భాష, ఆహార్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో సమ్మిళిత సంస్కృతికి ప్రతినిధులు వీరు. జీవన విధానంలో ఒక వైవిధ్యం కనిపిస్తుంది.. వారు ఎక్కడ ఉంటే అక్కడ ‘లిటిల్ ఇంగ్లండ్’ ఆవిష్కారమవుతుంది. రెండు భిన్న జాతుల సహజీవనానికి ప్రతీకలుగా 200 ఏళ్లకు పైగా తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఒకప్పటి బ్రిటన్ పూర్వీకులకు వారసులుగా ఇక్కడే పుట్టి పెరిగిన వీరు.. భాగ్యనగర జీవనంలో అంతర్భాగమయ్యారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆంగ్లో ఇండియన్స్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - పగిడిపాల ఆంజనేయులు ఒక సికింద్రాబాద్-ఒక ఇంగ్లండ్: నిజమే.. ఇది ఇప్పటి సంగతి కాదు. వందల ఏళ్ల నాటి చరిత్ర. నిజాం సంస్థానంలో సైనిక పటాలాలు, పరిపాలన కార్యాలయాలు, నివాస సముదాయాలను ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డ ఆంగ్లేయులతో సికింద్రాబాద్ ఇంగ్లండ్‌ను తలపించేది. ఆంగ్లేయుల పేరుతో వెలసిన ‘జేమ్స్ స్ట్రీట్’ వంటి బస్తీలు, ప్యారడైజ్‌లు, ప్యాట్నీలు ఆ సంస్కృతికి ప్రతిబింబాలు. తెల్లవాళ్ల విలక్షణమైన జీవన విధానం, భాష, దుస్తులు, అలంకరణ ఇక్కడి వారిని బాగా ప్రభావితం చేసింది. ఇక్కడి ప్రజల జీవన విధానంతో బ్రిటీష్ వారు కూడా ప్రభావితమయ్యారు. అలా సికింద్రాబాద్ ఒక సమ్మిళిత సంస్కృతికి కేంద్రబిందువైంది. బొల్లారం నుంచి మెట్టుగూడ వరకు, అల్వాల్ నుంచి లాలాగూడ వరకు కంటోన్మెంట్, పౌర ప్రభుత్వ కార్యాలయాలు వెలసిన ప్రతి చోటా కొత్త సంస్కృతి కూడా వెల్లివిరిసింది. భిన్న సంస్కృతి ఇలా.. ఆంగ్లేయులు ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకొని స్థిరపడ్డారు. అలా స్థిరపడిన వారి సంతతి ఆంగ్లో ఇండియన్స్. ఈస్టిండియా కంపెనీ కూడా ఈ సాంస్కృతిక సహజీవనాన్ని బాగా ప్రోత్సహించింది. భారతీయ మహిళలను వివాహం చేసుకునేవారికి ఆ రోజుల్లో 5 రూపాయల ప్రోత్సాహక బహుమతి కూడా ఇచ్చేవారు. అలా నగరంలోని సైనిక్‌పురి, దక్షిణ లాలాగూడ, మెట్టుగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు ఆంగ్లో ఇండియన్లకు నిలయమయ్యాయి. ‘ఒక్క శాతం’తో మొదలై.. ఆంగ్లో ఇండియన్లకు బ్రిటన్ ప్రభుత్వం సముచితమైన స్థానమిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఈ సమూహం ఆర్థికంగా స్థిరపడింది. రైల్వేలు, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్, క్రీడలు, సైన్యం, విద్య, వైద్యం వంటి రంగాల్లో చాలా మంది స్థిరపడ్డారు. 1956 నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఆంగ్లో ఇండియన్ ప్రముఖులు రాజకీయాల్లో రాణించారు. శాసన సభ్యులుగా నియమితులయ్యారు. తొలి దశాబ్దాల్లో జాన్ ఫెర్నాండెజ్, మెజోరి గాడ్‌ఫ్రె, క్లారిస్ మోరిస్, ఆస్వాల్డ్ పెడ్రో వంటి వారు ఆ తరువాత, ఇటీవల కాలంలో క్రిస్టీనా లాజరస్, డెల్లా గాడ్‌ఫ్రె, ప్రస్తుతం ఎల్విస్ స్టీఫెన్సన్ వంటివారు రాజకీయ రంగంలో ఉన్నారు. అభివృద్ధికి దూరంగా.. ఒకప్పుడు ఆంగ్లేయులు కల్పించిన రిజర్వేషన్ సదుపాయం వల్ల ఆంగ్లో ఇండియన్స్ కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ క్రమంగా ఉద్యోగావకాశాలకు దూరం కావడం, ఉన్నత చదువులు కూడా లేకపోవడంతో చాలా మంది సాంకేతిక నిపుణులుగా ఐటీఐ, వెల్డింగ్, మిషన్ రంగాల్లో అనుభవాన్ని ఆర్జించి ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు తరలి వెళ్లారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా, ఇక్కడే స్థిరపడ్డా ఇంగ్లిష్ భాష ఒక్కటే వారికి జీవనాధారంగా నిలిచింది. హైదరాబాద్‌లోని కాల్‌సెంటర్స్‌లో పనిచేసేవారిలో చాలామంది ఆంగ్లో ఇండియన్లే. భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ వారిని ఈ రంగంలో నిలబెట్టాయి. చాలా మంది విదేశాలకు తరలి వెళ్లడం వల్ల, ఆంగ్లో ఇండియన్ అమ్మాయిలు ఇతర హిందూ, హిందూయేతర వర్గాలకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల వీరి జనాభా క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో లక్షా 50 వేల మంది ఆంగ్లో ఇండియన్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య వేలకుపడిపోయింది. అవకాశాలు పెరగాలి.. అనేక శతాబ్దాలుగా భారతీయ సాంస్కృతిక జీవనంలో కలిసిపోయి, ఓటు హక్కుతో సహా అన్ని రకాల హక్కులను అనుభవిస్తున్న ఆంగ్లో ఇండియన్లను మైనారిటీ కమ్యూనిటీగా గుర్తించాలని ది ఆల్ ఇండియా ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. -
వారు ఏపీ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలా?: కేటీఆర్
టీడీపీ సభ్యులపై కేటీఆర్ విసుర్లు సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీకి ఆంగ్లో ఇండియన్స్‌ను నామినేట్ చేసిన తరహాలో ఆంధ్రప్రదేశ్ కొందరిని నామినేట్ చేసినట్టుంది. వారే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు. సభలో వారి తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది’ అని మంత్రి తారకరామారావు చేసిన వ్యాఖ్య సభలో కాసేపు దుమారం లేపింది. టీఆర్ఎస్ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ ప్రసంగిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు కరెంటు రాకుండా చేస్తున్నారని ఈశ్వర్ ఆరోపిస్తున్నపుడు టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయనకు, టీడీపీ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కేటీఆర్ జోక్యం చేసుకుని, దేశం సభ్యులకు కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ కరెంటు కష్టాలకు సంబంధించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేం దుకు నిన్న సభలో చేసిన తీర్మానంలోని మాటలనే ఈశ్వర్ ఉటంకించారు. అందులో వివాదమేమీ లేదు. ఆ తీర్మానానికి టీడీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. వారి తీరు చూస్తుంటే ఆంగ్లోఇండియన్లను అసెంబ్లీకి నామినేట్ చేసిన తరహాలో ఆంధ్రప్రదేశ్ వీరిని నామినేట్ చేసిందేమోననిపిస్తోంది’ అన్నారు. -
వైజాగ్ ‘పంచ్’ పవర్
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటి ష్ దేశీయులు తమ వినోదం కోసం ఇక్కడ సరదాగా బాక్సింగ్‌ను ఆడడం ప్రారంభించారు.. కాలక్రమేణా అది నేడు విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెడుతోంది. ఆంగ్లో ఇండియన్స్‌ను ఆనందింపజేసేందుకు నాటి విశాఖవాసులు చేతులకు గుడ్డలు చుట్టుకొని ఆడుతూ వినోదం పంచితే.. ప్రస్తుత తరం ప్రపంచ వేదికలపై పవర్ పంచ్‌లు విసురుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. పురుషులతోపాటు మహిళా బాక్సర్లనూ తయారు చేస్తూ విశాఖ.. జాతీయ స్థాయి శిక్షణ శిబిరాలకు కేంద్రంగా మారింది. ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీ కోమ్ కూడా ఈ శిబిరాల్లో పాల్గొన్న బాక్సరే. (-ప్రకాష్ మాడిమి, విశాఖపట్నం, న్యూస్‌లైన్) 1947కు ముందు ఆంగ్లో ఇండియన్లు విశాఖలో ఎక్కువగా నివసించేవారు. వారంతా ఇక్కడ రైల్వే, పోర్టు, షిప్ యార్డుల్లో పనిచేసేవారు. ఖాళీ సమయాల్లో ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ బాక్సింగ్ ఆడుతుంటే స్థానికులు అమితాసక్తితో గమనించేవారు. బ్రిటిష్ వారు నౌకల్లోని డెక్ పైన ఓపెన్ ప్లేస్‌లో ఈ ఆటలాడేవారు. ఇక డచ్ వారు నావికుల మధ్య బాక్సింగ్ పోటీలు పెట్టేవారు. నౌకల్లో పనిచేసే వారి చేతికి గుడ్డలు చుట్టి సాయంత్రం వేళల్లో రిక్రియేషన్‌గా బాక్సింగ్ పోటీలు నిర్వహించేవారు. నగదు ప్రోత్సాహకాలను కూడా అందించేవారు. ఈ పోటీల్ని ఆసక్తిగా గమనిస్తూ స్థానికులు బాక్సింగ్‌పై మక్కువ పెంచుకొన్నారు. క్రమంగా మెళకువలూ నేర్చుకున్నారు. జాతీయ సమాఖ్య ఏర్పాటుతో ప్రాధాన్యత.. అప్పటి వరకు బ్రిటిష్, డచ్‌వారికి ఆనందాన్నందించిన ఆ ఆట భారత బాక్సింగ్ సమాఖ్య ఏర్పడటంతో అధికారిక పోటీలకు నోచుకుంది. రైల్వే యార్డ్స్‌లో ఫోర్‌మెన్‌గా ఆంగ్లో ఇండియన్స్ ఉండటంతో బాక్సింగ్ సంస్కృతి అక్కడ నుంచే స్థానిక ఆటగాళ్లకు చేరింది. కాలక్రమేణా ఆంగ్లో ఇండియన్స్‌కు పోటీనిచ్చే స్థాయికి స్థానిక బాక్సర్లు ఎదిగారు. ఇదే క్రమంలో కోస్తా ప్రాంతంలో బాక్సింగ్ క్రీడకు ప్రాధాన్యత పెరిగింది. ఈస్ట్ కోస్ట్ ప్రాంతమైన విశాఖ నుంచి కోల్‌కతా వరకూ పాకింది. సమాఖ్య చొరవతో విశాఖ పాతపట్నమైన వన్‌టౌన్ ఏరియాలోనూ అమెచ్యూర్ ఆటగాళ్లు తయారయ్యారు. విశాఖ బాక్సింగ్ సంఘం ఆవిర్భావం.. విశాఖలో బాక్సింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ ముందుకొచ్చింది. 1997లో స్థానికంగానే ప్రాంతీయ హాస్టల్‌ను ఏర్పాటు చేసింది. అయితే పోటీలు ఎక్కడ, ఎలా జరుగుతాయనే విషయంపై అవగాహన లేకపోవడంతో పోటీల్లో తలపడే అవకాశం స్థానికులకు దక్కేది కాదు. ఈ పరిస్థితుల్లో జేమ్స్ ఆధ్వర్యంలో విశాఖలో బాక్సింగ్ సంఘం ఏర్పాటైంది. దీంతో స్థానికంగా కొన్ని క్లబ్‌లను ఏర్పాటు చేసి వాటి మధ్య పోటీలకు అంకురార్పణ జరిగింది. పది వెయిట్ కేటగిరీల్లో తలపడే క్లబ్‌లకు గుర్తింపునివ్వడం, మూడు టోర్నీల వరకు మిగిలిన క్లబ్‌లకు అవకాశం కల్పించి క్లబ్‌లను నియంత్రించడంతో బాక్సింగ్ టోర్నీల హవా ప్రారంభమైంది. దానికి నగర పోలీస్ కమిషనర్లు కూడా సహకరించారు. అయితే అప్పటికే బాక్సింగ్ శిక్షణ కేంద్రం తరలివెళ్లి డీఎస్ఏకు అనుసంధానం చేయడంతో మూడేళ్లకే హాస్టల్ ముగిసింది. అకాడమీ ఏర్పాటుతో ఊపు అప్పటి వరకు ప్రాంతీయ హాస్టల్‌గా ఉండి, శాప్‌కు అనుసంధానించబడిన బాక్సింగ్ క్రీడ.. అకాడమీ ఏర్పాటుతో విశాఖలో ఊపందుకుంది. మరో మూడేళ్ల పాటు శాప్ ఆధ్వర్యంలోపోర్ట్ స్టేడియంలోనే నడిచిన రాష్ట్ర అకాడమీ పాత్ర ముగిసింది. అయితే 2003లో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్).. అకాడమీల స్కీమ్‌లో భాగంగా విశాఖలో ఎస్టీసీ ఏర్పడింది. రెసిడెన్షియల్‌గా శిక్షణనిచ్చే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. జాతీయ శిక్షణ శిబిరాలు చోటు చేసుకున్నాయి. దాంతో అంతర్జాతీయ పోటీల్లోనూ విశాఖ బాక్సర్లు, ఇక్కడ శిక్షణ పొందిన బాక్సర్ల రాణింపు పెరిగింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కోమ్ కూడా ఇక్కడ నిర్వహించిన రెండు జాతీయ శిక్షణా శిబిరాల్లో పాల్గొంది. సీనియర్లే కోచ్‌లు.. స్థానికంగా బాక్సింగ్ క్రీడకు ప్రాచుర్యం ఉన్నా సాంకేతికంగా శిక్షణ పొందిన కోచ్‌లు కరువయ్యారు. దీంతో సీనియర్ బాక్సర్లే కోచ్‌ల పాత్రను కూడా పోషించాల్సి వచ్చింది. అయితే ఉమామహేశ్వరరావు కోచ్‌గా శిక్షణ తీసుకోవడంతో మార్పు చోటుచేసుకుంది. అదే క్రమంలో శిక్షకునిగా వచ్చిన వెంకటేశ్వరరావు కూడా ద్రోణాచార్య అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. 70వ దశకంలోనే సీనియర్ స్టేట్ మీట్‌కు వరుసగా రెండు సార్లు విశాఖ ఆతిథ్యమిచ్చింది. సాయి ప్రసాద్, ఉదయ్ ప్రకాష్, నాగేంద్ర, లింగేశ్వరరావు, ఇజాన్, వరహాలరావు వంటి వారు జాతీయస్థాయికి ఎదిగారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో సురేష్, ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో ఉదయ్‌ప్రకాష్, కిరణ్, యుగంధర్ లాంటివారు పదునైన పంచ్‌లతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా బాక్సర్లు కాలక్రమేణా విశాఖ అమ్మాయిలు కూడా బాక్సింగ్‌పై మక్కువ పెంచుకోసాగారు. ఏకంగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనే పతకాలు అందుకునే స్థాయికి ఎదిగారు. తొలిసారిగా ఈ ఘనతను సాధించిన బాక్సర్ కనకదుర్గ. 2004లో దుబాయ్ వేదికగా సాగిన అంతర్జాతీయ బాక్సింగ్‌లో ఈమె స్వర్ణం సాధించింది. మరో రెండేళ్లకు ఉష ఫైనల్‌కు చేరుకుని రజతాన్ని అందుకుంది. 2007లో ట్రైనింగ్ కమ్ కాంపిటీషన్లోనూ రజతాన్ని సాధించింది. ఆ తరువాత కోచ్ (ఎన్ఐఎస్)గానూ శిక్షణ పూర్తి చేసుకుంది. బాలుర విభాగంలోనూ... బాలుర విభాగంలో 2005లో ఎం.సురేష్ వియత్నాంలో జరిగిన ఆసియన్ క్యాడెట్ బాక్సింగ్‌లో కాంస్యం సాధించాడు. ప్రస్తుతం సబ్ జూనియర్స్ స్థాయిలోనూ విశాఖ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. 2005లో జరిగిన జాతీయ సబ్ జూనియర్స్ పోటీల్లో చిన్నారావు, భాస్కర్, సాగర్, శ్యామ్ కుమార్‌లు, ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీల్లో ప్రవీణ్ స్వర్ణ పతకాలు సాధించారు. బాలికల సబ్ జూనియర్స్‌లో ఉమారాణి, నిరోషా, సుజాత స్వర్ణాలందుకున్నారు. ఇంకా ఎంతో మంది వర్ధమాన బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ‘అప్పట్లో కిట్స్ కూడా ఉండేవి కావు’ అప్పట్లో నేను జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా.. ట్రాక్ తీసుకోవడం అంటే కలే. కనీసం కిట్స్ కూడా ఉండేవి కావు. ఏడాదికి ఒక టోర్నీలో తలపడితే గొప్పే. నేడు పరిస్థితులు పూర్తిగా భిన్నం. వసతులు పెరిగాయి. నెలకో టోర్నీ వచ్చింది. ఔత్సాహిక క్రీడాకారులు ట్రాక్ లేకుండా ప్రాక్టీస్‌నే మొదలెట్టడం లేదు. గల్లీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ విశాఖలో బాక్సింగ్ అభివృద్ధి చెందింది. - జేమ్స్, విశాఖ బాక్సింగ్ సంఘం వ్యవస్థాపకుడు ‘కామన్వెల్త్లో స్వర్ణం తెస్తా’ మూడో కామన్వెల్త్ బాక్సింగ్ ట్రయల్స్‌కు వెళ్తున్నాను. సీనియర్ విభాగంలో పతకాలు సాధించడమే లక్ష్యం. యూత్ కామన్వెల్త్లో స్వర్ణం సాధిస్తాను. 2009 నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయంగా పతకాలు సాధిస్తున్నా. రెండు సార్లు వరల్డ్‌కప్ బాక్సింగ్‌లో సత్తా చాటాను. టర్కీ, సెర్బియాల్లో స్వర్ణాలందుకున్నాను. బల్గేరియా, సెర్బియాల్లో ఫైనల్‌కు చేరాను. -నిఖత్ జరీన్ (బాక్సర్) ‘యూత్ ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్నా’ ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించాను. గతంలో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచాను. మరో టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాను. అయితే ప్రస్తుతం యూత్ ఒలింపిక్స్‌లో సీనియర్ విభాగంలో పతకం సాధించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. - శ్యామ్ కుమార్, అంతర్జాతీయ బాక్సర్