కేసీఆర్కు చేతగాకే బాబుపై విమర్శలు: వివేక్ | TDP mlas not joining TRS says vivek goud | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు చేతగాకే బాబుపై విమర్శలు: వివేక్

Published Mon, Oct 6 2014 12:35 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

కేసీఆర్కు చేతగాకే బాబుపై విమర్శలు: వివేక్ - Sakshi

కేసీఆర్కు చేతగాకే బాబుపై విమర్శలు: వివేక్

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్కు చేతగాకే చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ సమస్యకు కారణమైన కాంగ్రెస్ను వదిలేసి టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేయటం సరికాదని వివేక్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడరని ఆయన స్పష్టం చేశారు.

కాగా రాత్రి ఏడు గంటలకు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు మరోసారి భేటీ కానున్నారు. టీ.టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో పాటు, గ్రేటర్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. అలాగే టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement