
టీ.తెలుగు తమ్ముళ్లకు పవన్ కల్యాణ్ ఝలక్!
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంగళవారం తెలంగాణ టీడీపీ నేతలు ఫోన్ చేసినట్టు తెలిసింది.
హైదరాబాద్: తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం పవన్కు ఫోన్ చేసినట్లు సమాచారం. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ కూటమి తరఫున ప్రచారం చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరగా, అందుకు పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం.
కాగా 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ తరపున పవన్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన తెలుగు తమ్ముళ్లకు పవన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిరాశ పడినట్లు సమాచారం.