గ్రేటర్ ప్రచారానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదు | Pawan Kalyan invited to Greater campaign says by kishan reddy | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ప్రచారానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదు

Published Sat, Jan 23 2016 6:52 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

గ్రేటర్ ప్రచారానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదు - Sakshi

గ్రేటర్ ప్రచారానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ను ఆహ్వానించలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్లో శనివారం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఈ నెల 26 నుంచి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, హంసరాజు ఆహిరి, ప్రకాశ్ జవదేకర్, నక్వీ పాల్గొంటారని చెప్పారు. త్వరలో బీజేపీ - టీడీపీ ఉమ్మడి విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తామన్నారు. వచ్చే నెలలో తెలంగాణకు ప్రధాని మోదీ విచ్చేస్తారని చెప్పారు. రామగుండం ఎరువుల కంపెనీ, ఎన్టీపీసీలకు మోదీ శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ సాయంతోనే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణించారు. ఉగ్రవాదులకు ఎంఐఎం మద్దతుగా నిలుస్తోందని...ఎంఐఎంతో అధికార టీఆర్ఎస్ పార్టీ లోపాయికారి పొత్తు పెట్టుకుందని దత్తాత్రేయ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement