‘పవన్ కల్యాణ్ ఎప్పుడైనా చెప్పారా?’
‘పవన్ కల్యాణ్ ఎప్పుడైనా చెప్పారా?’
Published Wed, Nov 2 2016 7:52 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
అమరావతి: సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ ఎప్పుడూ ఎన్డీయే భాగస్వామ్య కూటమి పార్టీగా పని చేయలేదని.. మొన్నటి సాధారణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు మాత్రమే తెలిపారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. విజయవాడలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఇప్పటికీ ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగుతుందా? లేదా? అన్న విలేకరుల ప్రశ్నకు జవాబిస్తూ ‘ ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా చేరినట్టు పవన్ కల్యాణ్ ఎప్పుడైనా చెప్పారా? లేదంటే ఎన్డీయే కన్వీనర్ జనసేన పార్టీ భాగస్వామ్య పార్టీగా ఎప్పుడైనా ప్రకటించారా?’ అని ఎదురు ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో ఎన్డీయేకు ఆయన మద్దతు మాత్రమే తెలిపారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఆలోచనలు,సిద్దాంతాలు వేర్వేరు అయినప్పటికీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కలిసి పనిచేసే విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవని సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు.
Advertisement
Advertisement