
తెలంగాణ కార్యకర్తలకు అండగా ఉంటా: సుజనా
విశాఖపట్నం: తెలంగాణలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. సెంటిమెంట్ వల్లే తెలంగాణలో టీడీపీలో ఓడిపోయిందన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీయిచ్చారు. తెలంగాణ నాయకుల కోసం కార్యాలయం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
సుజనా చౌదరిని ఆయన నివాసంలో శుక్రవారం టీడీపీ నాయకులు సన్మానించారు. తెలంగాణలో కార్యకర్తలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించేందుకు కృషి చేయాలన్నారు. తెలంగాణలో అసమర్థ సీఎం ఉన్నందువల్లే కరెంట్ కష్టాలు వచ్చాయని విమర్శించారు.