చంద్రబాబుతో టీ. టీడీపీ ముఖ్యనేతల భేటీ | telangana tdp leaders met chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో టీ. టీడీపీ ముఖ్యనేతల భేటీ

Published Fri, Sep 18 2015 8:33 AM | Last Updated on Sat, Aug 11 2018 4:50 PM

చంద్రబాబుతో టీ. టీడీపీ ముఖ్యనేతల భేటీ - Sakshi

చంద్రబాబుతో టీ. టీడీపీ ముఖ్యనేతల భేటీ

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది.  ఈ భేటీకి పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు.  తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ సారధి కోసం 'మొబైల్' సర్వే ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో సారధ్యం వహించగలిగిన నాయకుడెవరంటూ ఆ పార్టీ సెల్ ఫోన్లలో వెతుకులాడుతోంది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement