రేవంత్.. ఓ బుడ్డర్‌ఖాన్! | Home Minister Nayani Narasimha Reddy fires on tdp leader revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్.. ఓ బుడ్డర్‌ఖాన్!

Published Fri, Nov 18 2016 3:33 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

రేవంత్.. ఓ బుడ్డర్‌ఖాన్! - Sakshi

రేవంత్.. ఓ బుడ్డర్‌ఖాన్!

మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైర్
- అడ్డగోలుగా మాట్లాడితే తరిమికొడతరు
- రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావడం అదృష్టం
- మోదీ, కేసీఆర్ పనితీరుపై చర్చిద్దాం
- బీజేపీ నాయకులకు నారుుని సవాల్
 
 సాక్షి, సిరిసిల్ల: టీడీపీ నేత రేవంత్‌రెడ్డి..ఓ బుడ్డర్‌ఖాన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో ఐటీఐ భవన నిర్మాణానికి, సర్ధాపూర్‌లో 17వ బెటాలియన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ’రేవంత్‌రెడ్డి అని.. ఓ బుడ్డర్‌ఖాన్ ఉన్నడు.. అడ్డగోలుగా మాట్లాడుతున్నడు.. కేసీఆర్‌ను తిట్టే స్తోమత నీకు లేదు.. నువ్వో.. బచ్చావి.. ఇదే హెచ్చరిక చేస్తున్నా.. నిన్ను మహిళలే తరిమి తరిమి కొడుతరు’ అంటూ మండిపడ్డారు.

తెలంగాణలో టీడీపీకి అడ్రస్ లేకుండా పోరుుందని, ఉన్న ఒకరిద్దరితో అయ్యేదేమీలేదన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారన్నారు. కేసీఆర్ సీఎం కావడం రాష్ట్రానికి అదృష్టమన్నారు. ఇన్నేళ్లుగా ఇంటింటికీ నీళ్లు అందించాలనే కనీస ఆలోచన ప్రతిపక్షాలు కూడా చేయలేదన్నారు. ఈ డిసెంబర్ నాటికి నల్లగొండ, జనగామ జిల్లాల్లో మూడు వేల ఇండ్లకు, వచ్చే ఏడాది వరకు తెలంగాణ మొత్తానికి నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎవరేం చేశారో చర్చపెట్టాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు నాయకుడు లేడని, సీపీఎంకు తెలంగాణలో అడ్రస్ లేదన్నారు. ఐటీలో కేటీఆర్ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపాడన్నారు. చైనా, రష్యా, ఆస్ట్రేలి యా దేశాలు తెలంగాణలో పరిశ్రమలు పెడతా మంటూ కేటీఆర్ వెంటపడుతున్నాయని చెప్పారు. దేశంలోనే కేసీఆర్ నెంబర్ వన్ సీఎం అని సర్వేలు తేల్చాయన్నారు. కేటీఆర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసిస్తూ, సన్మానం చేసిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో హైదరా బాద్‌కు ఇన్‌చార్జ్‌గా కేటీఆర్ రావడంతోనే రికార్డు విజయం సొంతం చేసుకున్నా మన్నారు. విద్యకు కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నా రని చెప్పారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.



 కోటి ఎకరాలకు సాగునీరు.. ఇంటింటికీ తాగునీరు: మంత్రి కేటీఆర్
 కోటి ఎకరాలకు సాగునీరు, ఇంటింటికీ తాగునీరు అందివ్వడం సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’ అనే విధంగా తెలంగాణ మారాలనేది ముఖ్యమంత్రి కల అన్నారు. వడ్డీలేని రుణాల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందని, త్వరలో అవి బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయన్నారు. డబ్బులు చేతుల్లోకి ఎప్పుడొస్తాయో తాము చెప్పలేమని, అది ప్రధాని మోదీ చేతిలో ఉందని చమత్కరించారు. 4 లక్షల మంది బీడీ కార్మికులు నెలకు రూ.40 కోట్లు పింఛన్  ఇచ్చి అండగా నిలిచింది కేసీఆరేనన్నారు. టీడీపీ హయాంలో ఒకరి చనిపోతేనే మరొకరికి పింఛన్ వచ్చే దుస్థితి ఉండేదని, కాంగ్రెస్ ఇచ్చిన రూ.200 కనీసం మందుబిళ్లలకు కూడా సరిపోయేది కాదన్నారు. తాము వాటిని ఐదింతలు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 29 లక్షల మందికి రూ.800 కోట్లు ఇస్తే, తాము 38 లక్షల మందికి రూ.4500 కోట్లు పింఛన్ కింద చెల్లిస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యంపై నియం త్రణ ఎత్తివేసి, ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తున్నామన్నారు.

కేసీఆర్ మనుమడు, మనుమరాలు తినే సన్నబియ్యాన్ని హాస్టల్ విద్యార్థులకు పెడుతున్నామని, ఇది సీఎం మానవీయతకు నిదర్శనమని పేర్కొ న్నారు. 2018 చివరినాటికి ఇంటింటికి నీళ్లు ఇవ్వక పోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న సీఎం కేసీఆర్‌అన్నారు. 5400 పాఠ శాలల్లో 3354 పాఠశాలల్లో డిజిటల్ బోధనలు ప్రారంభమ య్యాయన్నారు. ఓ వైపు ప్రజల కోసం ఇన్ని కార్యక్రమాలు చేపడు తుంటే, మరిచిపోరుున పార్టీలు, జెండాలు పట్టుకొని యాత్రలకు బయలుదేరాయని ఎద్దేవా చేశారు. రైతులను పట్టుకొని ఎంత కష్టమొచ్చిదంటూ ఏడుస్తున్నారని, సంక్రాంతికి రెండు నెలలు ముందే గంగిరెద్దోళ్లు వచ్చారని రైతులు ఆగమైతున్నారన్నారు. అలాంటి ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement