
టీడీపీని వీడే ప్రసక్తే లేదు: ఎల్.రమణ
కరీంనగర్: తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తన గురించి అనవసరంగా మాట్లాడితే ఊరుకోను' అని హెచ్చరించారు.
రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవే తన బిడ్డలకు ఇచ్చానట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ నాయకులు అలా ఇవ్వగలరా? అంటూ ఎల్. రమణ సూటిగా ప్రశ్నించారు.