అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలని గవర్నర్ నరసింహన్ను కోరినట్లు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు.
హైదరాబాద్ : అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలని గవర్నర్ నరసింహన్ను కోరినట్లు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం గవర్నర్ను కలిశారు. భేటీ అనంతరం టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ తమ విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. అక్రమ భూ బదలాయింపులు కూడా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.
రైతాంగ, విద్యుత్, విద్యార్థి, సంక్షేమ సమస్యలతో తెలంగాణ ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఎల్ రమణ అన్నారు. మెట్రో అలైన్మెంట్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు ఆటంకంగా మారిందన్నారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాలే వేదిక అన్నారు. అఖిలపక్ష భేటీలోనే అన్ని నిర్ణయాలన్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఎల్ రమణ ఆరోపించారు. వెంటే అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.