
సాక్షి, హైదరాబాద్ : పార్టీని వీడిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ టీడీపీని విచ్ఛిన్నం చేయడానికి రేవంత్ కుట్ర పన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్.రమణ ఆదివారమిక్కడ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ...‘ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కర్‌రావు తరహాలో రేవంత్ కూడా పార్టీని దెబ్బతీయాలని చూశారు. నాడు ఇందిరా గాంధీతో కలిసి నాదెండ్ల టీడీపీని విచ్ఛిన్నం చేయాలని చూశారో, నేడు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో కలిసి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు.
పార్టీ నుంచి వెళ్లిపోతున్న సమయంలో చేసే ఆరోపణలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా భావాలకు దగ్గరగా ఉండేవారితో పొత్తు ఉంటుంది. రేవంత్‌కు పార్టీ సముచిత స్థానం ఇచ్చింది. అయితే ఆయన అది నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి పార్టీని వీడుతూ పెట్టుకున్నది కన్నీళ్లు కాదు..మొసలి కన్నీరు. ఇక నేను రేవంత్‌రెడ్డిని సోదరుడిలా భావించి ప్రోత్సహించాను. అవకాశవాద రాజకీయాలకు రేవంత్ రెడ్డి పరాకాష్టగా నిలిచాడు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీకి నిలబెడతాం. మా భావాలకు దగ్గరగా ఉండేవారితో పొత్తు ఉంటుంది.’ అని అన్నారు.
రేవంత్‌పై ఎల్.రమణ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment