కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారు: చంద్రబాబు | chandrababu naidu attend telangana tdp mahanadu | Sakshi
Sakshi News home page

కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారు: చంద్రబాబు

Published Wed, May 24 2017 6:51 PM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారు: చంద్రబాబు - Sakshi

కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారు: చంద్రబాబు

హైదరాబాద్‌ : తెలంగాణలో రాజకీయ చైతన్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ అధ‍్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలంగాణ టీడీపీ మహానాడులో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ వచ్చాకే తెలంగాణలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. తెలంగాణలో ప్రతీ కార్యకర్త కొదమ సింహాల్లా దూసుకెళ్తున్నారని అన్నారు.

ఎన్టీఆర్‌ పెట్టిన ముహుర్త బలం వల్ల మనం ఎవ్వరికీ భయపడటంలేదని, తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడేవరకూ పోరాడతామని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేశారని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా ప్రజల కోసమే పని చేస్తోందని, తెలుగువారికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement