టీ. టీడీపీ ఎమ్మెల్యేలు 'జంపింగ్ రాగం' | Telangana TDP MLAs ready to jump? | Sakshi
Sakshi News home page

టీ. టీడీపీ ఎమ్మెల్యేలు 'జంపింగ్ రాగం'

Published Sun, Dec 15 2013 12:18 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

టీ. టీడీపీ ఎమ్మెల్యేలు 'జంపింగ్ రాగం' - Sakshi

టీ. టీడీపీ ఎమ్మెల్యేలు 'జంపింగ్ రాగం'

రాష్ట్ర విభజనపై రెండు కళ్ల సిద్దాంతం, కొబ్బర చిప్పల సూత్రమంటూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

రాష్ట్ర విభజనపై రెండు కళ్ల సిద్దాంతం, కొబ్బర చిప్పల సూత్రమంటూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముఖ చిత్రం పూర్తిగా మారే అవకశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలోని పలు జిల్లాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మరోపార్టీలోకి జంప్ చేసేందుకు జంపింగ్ జపాంగ్ రాగాన్ని అలపిస్తున్నారని గుసగుసలు పుట్టుకొస్తున్నాయి.

 

అందుకు వరంగల్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు ముందు వరుసలో ఉన్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అవి పూర్తి నిరాధారాలని వరంగల్ జిల్లా టీడీపీ నేతలు కొట్టిపారేశారు. అయితే తాను ప్రస్తుతం టీడీపీలోనే ఉంటానని, అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలపై నిర్ణయం తీసుకుంటానంటూ ఎర్రబెల్లి పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టారు.

 

మరో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాత్రం తెలంగాణలో అత్యంత బలమైన పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అంటూ బల్లగుద్ది మరి చెప్పారు.  అయితే తెలంగాణ ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, అన్నపూర్ణమ్మ, నగేష్లు మరో పార్టీలోకి వలసపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement