పారామిలిటరీ బలగాల సహాయం కావాలి: నాయిని
మండి( హిమాచల్ ప్రదేశ్): హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన వీఎన్ఆర్ విజ్క్షాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను వెతికేందుకు పారామిలిటరీ బలగాల సహాయం అందించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కోరారు. సహాయ సహకార చర్యలపై రాజ్‌నాథ్‌తో నాయిని నర్సింహరెడ్డి ఫోన్ సంభాషించారు.
విద్యార్థులను వెతికేందుకు పారామిలిటరీ బలగాలు దించాలని కోరిన నాయిని ప్రతిపాదనకు హోం మంత్రి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. హోంశాఖ కార్యదర్శితో మాట్లాడి తక్షణం చర్యలు తీసుకుంటానన్న రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్టు సమాచారం.