24 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు | 24-hyderabad-students-go-missing-in-himachal-river | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 9 2014 10:18 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. అప్పటివరకు ఉల్లాసంగా.. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ, ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడింది. తేరుకునే లోపే దాదాపు 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. కొంతమంది విద్యార్థుల మృతదేహాలు లభించాయని మండి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement