హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతు కావడం, అందులో కొందరు మృతిచెందిన విషాద ఘటనపై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
సాక్షి, ఖమ్మం: హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతు కావడం, అందులో కొందరు మృతిచెందిన విషాద ఘటనపై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటిం చారు. ఖమ్మం నగరానికి చెందిన ముప్పిడి కిరణ్‌కుమార్, పాల్వంచకు చెందిన ఉపేందర్‌లు ఈ ఘటనలో గల్లంతు కావడం తనను కలచివేసిందని ఆయన అన్నారు.
వీరిద్దరి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అటు కేంద్రప్రభుత్వం, ఇటు హిమాచల్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నానని, గల్లంతయిన వారి సమాచారం త్వరలోనే తెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్ ఉన్న యువ ఇంజనీర్లను బియాస్ నది మింగేయడం బాధాకరమని, బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
మృతుల కుటుంబాలను అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు వారికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.