హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ ప్రమాద బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అలాగే హైదరాబాద్లో తెలంగాణ అమర వీరుల సంస్మరణార్థం స్థూపం నిర్మాణం చేపట్టనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావం రోజున జిల్లాల్లో కూడా అమరవీరులకు నివాళి కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళుల తర్వాతనే రాష్ట్ర అవతరణ వేడుకలుంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం సభలో కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ అమరవీరుల సంతాప తీర్మానాలను అసెంబ్లీ ఆమోదించింది.