రేపు హైదరాబాద్కు తరుణ్ మృతదేహం
మండి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థులలో ఈరోజు ఒక విద్యార్థి మృతదేహం లభించింది. ఆ మృతదేహం వెంకట దుర్గా తరుణ్దిగా గుర్తించారు. పండో రిజర్వాయర్ వద్ద రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే వాటిలో ఒకటి ఇంజనీరింగ్ విద్యార్థి తరుణ్‌దిగా కాగా, మరొకటి స్థానికుడిదిగా గుర్తించారు. తరుణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. రోడ్డు మార్గంలో మృతదేహాన్ని ఢిల్లీకి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ తరలిస్తారు. తరుణ్ మృతదేహం రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో ఈ నెల 8వ తేది ఆదివారం 24 మంది విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిందే. వారిలో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు లార్జి డ్యామ్‌లో దిగిన సమయంలో గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా పెరిగిన ప్రవాహ ఉధృతికి విద్యార్థులు కొట్టుకుపోయారు. ఇంతకు ముందు 8 మృతదేహాలు దొరికాయి. ఈ రోజు దొరికి మృతదేహంతో మొత్తం 9 దొరికాయి. ఇంకా 15 మృతదేహాలు లభ్యం కావలసి ఉంది. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తునే ఉన్నారు.
గల్లంతయినవారు:
1.దాసరి శ్రీనిధి
2.కాసర్ల రిషిత రెడ్డి
3. గంపల ఐశ్యర్య
4. లక్ష్మీగాయత్రి
5.ఆకుల విజేత
6. రిథిమ పాపాని
7.కల్లూరి శ్రీహర్ష
8. దేవాశిష్ బోస్
9. బైరినేని రిత్విక్
10. ఆషిష్ మంత
11.సందీప్ బస్వరాజ్
12.అరవింద్
13.పరమేష్
14. జగదీష్ ముదిరాజ్
15. అఖిల్-మిట్టపల్లి
16. ఉపేందర్
17.అఖిల్-మాచర్ల
18.భానోతు రాంబాబు
19. శివప్రకాష్ వర్మ
20. ఎం.విష్ణువర్ధన్
21.సాయిరాజ్
22.సాబేర్ హుస్సేన్
23. కిరణ్ కుమార్
24. పి.వెంకట దుర్గ తరుణ్
దొరికిన మృతదేహాలు :
1. గంపల ఐశ్యర్య
2. ఆకుల విజేత
3 భానోతు రాంబాబు
4.లక్ష్మీగాయత్రి
5. దేవాశిష్ బోస్
6. షాబేర్ హుస్సేన్
7. టి.ఉపేందర్
8.అరవింద్ కుమార్
9.పి.వెంకట దుర్గ తరుణ్