విద్యార్ధుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రణబ్ సంతాపం
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో మరణించిన విద్యార్ధులు మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఱటనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ప్రణబ్ విజ్క్షప్తి చేశారు.
అంతేకాక మృతుల కుటుంబాలకు సహాయ చర్యలు అందించాలని హిమాచల్ ప్రభుత్వానికి సూచించారు. అంతేకాక గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్రపతి కోరినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ఉర్మిలా సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ కు చెందని వీఎన్ఆర్ విజ్క్షాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్ధులు బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్గటనలో ఇప్పటి వరకు ఐదు మృత దేహాలను వెలికి తీశారు.