మండి కలెక్టర్పై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆగ్రహాం | YSR Congress party MPs takes on Mandi District Collector | Sakshi
Sakshi News home page

మండి కలెక్టర్పై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆగ్రహాం

Published Tue, Jun 10 2014 3:18 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

మండి కలెక్టర్పై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆగ్రహాం - Sakshi

మండి కలెక్టర్పై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆగ్రహాం

బియాస్ నది దుర్ఘటనలో మునిగిపోయిన విద్యార్థుల ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలు వేగవంతం చేయాలని మండి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.

బియాస్ నది దుర్ఘటనలో మునిగిపోయిన విద్యార్థుల ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలు వేగవంతం చేయాలని మండి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతుపై మంగళవారం మండిలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్లంతైన విద్యార్థుల విషయం జిల్లా యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తుందని వైఎస్ఆర్ ఎంపీలు ఆరోపించారు. సంఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఇంకా విద్యార్థులను గుర్తించకపోవడం ఏమిటని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్పై మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement