'ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి' | YSR Congress party MPs demands Rs 20 lakh for Beas river tragedy victims | Sakshi
Sakshi News home page

'ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి'

Published Tue, Jun 10 2014 12:01 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

'ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి' - Sakshi

'ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి'

బియాస్ నది దుర్ఘటనలో మరణించిన మృతదేహాలను వెలికి తీసేందుకు చేపట్టిన సహాయకచర్యలు ఆశించినంత వేగంగా జరగడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు.

బియాస్ నది దుర్ఘటనలో మరణించిన మృతదేహాలను వెలికి తీసేందుకు చేపట్టిన సహాయకచర్యలు ఆశించినంత వేగంగా జరగడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హిమాచల్ప్రదేశ్లోని పండో రిజర్వాయర్ వద్ద ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వైఎస్ఆర్ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. విద్యార్థులను నీటి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్లను పెంచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ. 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయి 40 గంటలు గడిచిన ఇప్పటి వరకు వాళ్ల మృతదేహలను బియాస్ నది నుంచి వెలికి తీయలేకపోయారని ప్రభుత్వ ఆలసత్వంపై వైఎస్ఆర్ ఎంపీలు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరంలోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు నీట మునిగి గల్లంతైన అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల స్పందన మాత్రం నామమాత్రంగా ఉందని ఆరోపించారు. విద్యార్థులు మృతదేహాలను వెలికి తీసేందుకు అధునాతన పరికరాలను వినియోగించి గాలింపు చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రభుత్వానికి సూచించారు. అనంతరం వారు మండి జిల్లా కలెక్టర్ను కలుసుకున్నారు. విద్యార్థుల ఆచూకీ కోసం సహాయక చర్యలు వేగవంతం చేయాలని మండి కలెక్టర్కు వారు విజ్ఞప్తి చేశారు. దుర్ఘటన ఆదివారం జరిగిన ఇప్పటి వరకు విద్యార్థులను గుర్తించకపోవడంపై కలెక్టర్ ముందే ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement