బియాస్ నదిలో రిథిమ మృతదేహం లభ్యం
బియాస్ నదిలో రిథిమ మృతదేహం లభ్యం
Published Wed, Jun 25 2014 6:34 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM
హిమాచల్ ప్రదేశ్: బియాస్ నది దుర్ఘటనలో చనిపోయిన మరో విధ్యార్ధి మృతదేహం బుధవారం లభ్యమైంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని రిథిమ మృతదేహంగా గుర్తించారు. బియాస్ నది దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు దొరకాల్సి ఉంది. మిగితా విద్యార్ధుల మృత దేహాల కోసం వెతుకులాట కొనసాగుతోంది.
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఆకస్మికంగా నీటి ప్రవాహం పెరగడంతో జూన్ 8వ తేది ఆదివారం విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్ధులు గల్లైంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లైంతనవారిలో 18 మంది విద్యార్ధుల మృతదేహాలు లభ్యమవ్వగా, ఇంకా 6 మృతదేహాలు దొరకాల్సి ఉంది.
Follow @sakshinews
Advertisement