
సాక్షి, ముంబై: దేశీయ ఎలక్ట్రానిక్స్ స్టోర్ విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు విజయ్ సేల్స్ స్టోర్స్, ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఆపిల్ డేస్ సేల్ కొనసాగనుంది.
ఈసేల్‌లో యాపిల్ ఐఫోన్13, 14, ఎంఐ మ్యాక్‌బుక్‌ఎయిర్ (M1 MacBook Air) తదితర యాపిల్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ ,డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కారర్డ్స్‌కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు , ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లను కూడా పొందవచ్చు. అలాగే నో కాస్ట్ EMI స్కీమ్ కూడాఉంది. దీంతోపాటు మొత్తం కొనుగోలుపై 0.75శాతం MyVS లాయల్టీ రివార్డ్ పాయింట్‌లను ఆఫర్ చేస్తుందిజ వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలో విస్తరించి ఉన్న కంపెనీకి చెందిన 125+ స్టోర్‌లలోఈ సేల్ యాక్టివ్‌గా ఉంటుంది. కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆఫర్‌లను పొందవచ్చు. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!)
రూ. 69,900విలువైన ఐఫోన్ 13 ప్రత్యేక డీల్ ధర రూ. 61,490. హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా రూ. 2వేలు తగ్గింపు. మొత్తంగా రూ. 59,490కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ )
ఐఫోన్ 14 ప్లస్ ఆఫర్ ధర రూ. 80,490 కాగా, వెనిలా ఐఫోన్ 14 రూ. 70,990కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్‌లు వరుసగా రూ. 1,20,990 , రూ. 1,31,490కి అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ , డెబిట్ కార్డ్‌ల ద్వారా ఐఫోన్ 14 సిరీస్‌పై రూ. 4వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం. (ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!)
యాపిల్ ఎంఐ మ్యాక్ బుక్ ఎయిర్ రూ. 82,900కి అందుబాటులో ఉంటుంది. మిగిలిన ల్యాప్‌టాప్‌లపై కస్టమర్‌లు రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఇంకా ఐప్యాడ్స్ , ఎయిర్‌పాడ్స్, వాచెస్‌పై తగ్గింపుధరలను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment