సహకరించిన కానిస్టేబుల్
వివాహేతర సంబంధమే మహిళ హత్యకు కారణం
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు
ముగ్గురి అరెస్ట్
నల్లబెల్లి : మండలంలోని గుండ్లపాహాడ్ శివా రు బజ్జుతండాలో ఈ నెల 16న జరిగిన వివాహిత హత్య కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఆమె కుమారుడు తన తండ్రి, పెద్దనాన్నతో కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్ నల్లబెల్లి ఎస్సై ఎస్‌కె హమీద్‌తో కలిసి కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. గీసుగొండ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన కొర్ర సోమ్లి, బాలాజీ దంపతుల చిన్న కుమార్తె విజయ(36)కు నల్లబెల్లి మండలం గుండ్లపాహాడ్ శివారు బజ్జుతండాకు చెందిన బాదవత్ వీరన్నతో 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 15 ఏళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు.
వారిలో ఒక కుమారుడు కొంతకాలంగా తల్లిపై అనుమానం పెంచుకున్నాడు. ఆ బాలుడు తండ్రి వీరన్న, కొత్తగూడలో పోలీస్ కానీస్టేబుల్‌గా పని చేస్తున్న పెద్దన్నాన్న స్వామినాయక్‌తో చర్చించాడు. ఈ క్రమంలో స్వామినాయక్ సహకారంతో బాలుడు తండ్రి వీరన్నతో కలిసి తల్లిని చిత్రహింసలకు గురిచేసి హతమార్చి మృతదేహాన్ని ఇంట్లో ఫ్యాన్ కర్రకు ఉరివేశారు. తెల్లావారుజామున విజయ మృతిచెందిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పి ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తండ్రితో కలిసి తల్లిని చంపిన తనయుడు
Published Sat, Nov 28 2015 2:10 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement