ప్రియుడే కడతేర్చాడు | A woman has been murdered | Sakshi
Sakshi News home page

ప్రియుడే కడతేర్చాడు

Published Thu, Jul 6 2017 4:20 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

ప్రియుడే కడతేర్చాడు - Sakshi

ప్రియుడే కడతేర్చాడు

అన్నానగర్‌: వివాహేతర సంబంధం ఓ మహిళను బలి తీసుకుంది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహించి ప్రియుడే ఆమెను కడతేర్చాడు. నెల్లై జిల్లా ముక్కుడలైకి చెందిన చంద్రశేఖర్‌ భార్య ఆనంది (38). వీరికి సుజీధరన్, అస్సుదన్‌ ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్‌ పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆనంది ఇద్దరు కుమారులతో ఉంటోంది. ఆనంది పెద్ద కుమారుడు సుజీధరన్‌ డిగ్రీ, రెండవ కుమారుడు అస్సుధన్‌ ప్లస్‌ఒన్‌ చదువుతున్నాడు. పేటైలో ఉన్న పిల్లల వసతిగృహంలో ఆనంది వంటమనిషిగా చేరింది. దీంతో ఆనంది కుటుంబం సహా పేటైలో నివాసం ఉంటోంది. వసతి గృహంలోనే ఉన్న ఓ గదిలో తన కుమారులతో ఉంటూ వంటపని చేసేది.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం వసతిగృహంలో ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఆనంది హాస్టల్‌లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తికి, ఆనందికి ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆనందిని కత్తితో నరికి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న నెల్లై టౌన్‌ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆనంది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసుల విచారణలో ఆనందితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ముక్కుడల్‌ సమీపంలో ఉన్న సింగమ్‌పాలైకి చెందిన చెల్లప్ప (50) ఈ హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేశారు.

విచారణలో ఆనంది భర్త చంద్రశేఖర్, చెల్లప్ప స్నేహితులని, తరచూ వారి ఇంటికి వెళ్లే వాడని చంద్రశేఖర్‌ మృతిచెందడడంతో ఆనందితో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు తెలిపాడు. ఈ క్రమంలో ఆనంది వసతిగృహంలో వంటమనిషిగా చేరిన తరువాత చెల్లప్పతో మాట్లాడేది తగ్గించింది. దీంతో మంగళవారం ఉదయం హాస్టల్‌లోని పిల్లలు పాఠశాలకు వెళ్లిన తరువాత చెల్లప్ప హాస్టల్‌కి వెళ్లాడు. ఆనందితో తన కోరిక తీర్చమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన చెల్లప్ప ఆనందిని కత్తితో నరికి హత్య చేసినట్టు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement