
సంఘటనా స్థలంలో పోలీసులు
సేలం: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని, ఆమె కుమారుడు స్నేహితులతో కలిసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. సేలం అలగాపురం పెరియపుదూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గోపాల్ (36). ఇతనికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గోపాల్‌కు పెరియపుదూర్‌కు చెందిన జ్యోతి (40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. జ్యోతికి భర్త లేకపోవడంతో గోపాల్ భార్య పిల్లలను వదిలేసి ఆమె ఇంటి వద్దకే వెళ్లిపోయాడు. జ్యోతికి కుమారుడు ఉలగనాథన్, మరో కుమార్తె ఉన్నారు.
గోపాల్‌కు జ్యోతి కుమారుడు ఉలగనాథన్‌కు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గురువారం జ్యోతి ఉద్యోగానికి వెళ్లగా, గోపాల్ ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. సాయంత్రం 4గంటల సమయంలో ఉలగనాథన్ నలుగురు స్నేహితులతో ఇంటికి వచ్చి గోపాల్‌తో గొడవకు దిగాడు. తర్వాత వారంతా కలిసి కత్తితో గోపాల్‌ను నరికి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన గోపాల్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అలగాపురం పోలీసులు పరారైన ఉలగనాథన్ సహా ఐదుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment