
జెనీవా: భారత్‌లో లైంగిక వేధింపుల ఆరోపణల కేసులు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన నిత్యానంద స్వామి నెలకొల్పినట్లు చెబుతున్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే)’ దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులు జెనీవాలో గత నెల 24న ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక చర్చాగోష్టిలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఐరాస గుర్తించని దేశం తరఫు వ్యక్తులు ఆ కార్యక్రమంలో ఎలా భాగస్వాములయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఐరాస స్పష్టతనిచ్చింది.
‘యూఎస్‌కే ప్రతినిధులు వాస్తవానికి ఒక దేశం తరఫున ఆ చర్చలో పాల్గొనలేదు. కేవలం ఒక స్వచ్ఛంద సంస్థగా వాళ్లు వచ్చి మాట్లాడారు. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు’ అని ఐరాస బుధవారం స్పష్టంచేసింది. ‘ జెనీవా చర్చాగోష్ఠిలో ముందస్తు అనుమతితో ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. పలు సమస్యలు, ఇతివృత్తాలపై వెలువడే భిన్నాభిప్రాయాలతో కూడిన ముసాయిదా అది. ఐరాసలో కైలాస దేశ శాశ్వత మహిళా రాయబారిగా చెప్పుకున్న విజయప్రియ నిత్యానంద అభిప్రాయాలను పట్టించుకోబోం’ అని జెనీవాలోని ఐరాస మానవహక్కుల హై కమిషనర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment