Swamy Nithyananda
-
నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు
గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు సీనియర్ నటుడు అశోక్ కుమార్. ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న ఆయన సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు. నచ్చని పెళ్లితో మొదట్లో తిప్పలు పడ్డ ఆయన తర్వాత భార్యను అక్కున చేర్చుకున్నారు. కానీ వారి సంతానమే తనకు తలవంపులు తెచ్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇష్టం లేని పెళ్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 'మొదట నేను పోలీసాఫీసర్‌గా పని చేశాను. కానీ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఓ హోటల్ నడిపాను. అందులో నష్టాలు రావడంతో అక్కడికి వెళ్లడమే మానేశాను. అది ఇంకా దివాలా తీయడంతో మా బావగారు వచ్చి ఆ హోటల్ చూసుకున్నారు. ఖాళీగా ఎందుకు ఉండటమని మద్రాసు వెళ్లాను. విలన్‌గా, సహాయ నటుడిగా సినిమాలు చేశాను. రామానాయుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నారు. అందుకే సినిమాలు మానేశా.. చివరకు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా వల్ల నన్ను తీసేసి జగ్గయ్యను హీరోగా పెట్టారు. ఇలా కొన్ని సంఘటనలు జరగడంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. ఇలాంటి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? ఇక్కడికి వచ్చి తప్పు చేశానేనని ఫీలయ్యాను. ఈ సినీ ఇండస్ట్రీకి నేను పనికి రాను అని అర్థమైంది. అందుకే సినిమాలు మానేశాను' అని చెప్పుకొచ్చారు. ముగ్గురికి పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులు తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'నా కుటుంబమే నాకు శత్రువు. అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా మండపంలో చూశాక ఆమె నాకు నచ్చలేదు. కానీ చేసేదేం లేక మనసొప్పకపోయినా పెళ్లి చేసుకున్నాను. ఈ కారణం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాను. నా వల్ల అమ్మాయిని బాధపడుతోందని తనను నాతోపాటే మద్రాసుకు తీసుకొచ్చాను. మాకు ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులయ్యాయి. నిత్యానంద మాయలో పడి ఇప్పటికీ అతడితోనే! రెండో అమ్మాయి రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. నాకది నిజమో, కాదో తెలియదు. వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలయితే ఉన్నాయి. ఒక్కటైతే నిజం.. నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులిచ్చింది. కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను. నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునేవాళ్లే లేరు. నిత్యానంద మాయలో పడి నా ఇద్దరు కూతుళ్లు అతడి వెంటే వెళ్లారు. ఇప్పటికీ అతడితోనే ఉన్నారు. ఇదంతా భరించలేక నా భార్య అనారోగ్యానికి గురై మరణించింది. నా మూడో కూతురే నన్ను చూసుకుంటోంది. మిగతా ఇద్దరూ ఇంతవరకు నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు' అని ఎమోషనలయ్యారు అశోక్ కుమార్. చదవండి: హోటల్లో విగతజీవిగా కనిపించిన నటుడు -
‘నిత్యానంద కైలాస’ను పరిగణించం: ఐరాస
జెనీవా: భారత్‌లో లైంగిక వేధింపుల ఆరోపణల కేసులు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన నిత్యానంద స్వామి నెలకొల్పినట్లు చెబుతున్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే)’ దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులు జెనీవాలో గత నెల 24న ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక చర్చాగోష్టిలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఐరాస గుర్తించని దేశం తరఫు వ్యక్తులు ఆ కార్యక్రమంలో ఎలా భాగస్వాములయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఐరాస స్పష్టతనిచ్చింది. ‘యూఎస్‌కే ప్రతినిధులు వాస్తవానికి ఒక దేశం తరఫున ఆ చర్చలో పాల్గొనలేదు. కేవలం ఒక స్వచ్ఛంద సంస్థగా వాళ్లు వచ్చి మాట్లాడారు. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు’ అని ఐరాస బుధవారం స్పష్టంచేసింది. ‘ జెనీవా చర్చాగోష్ఠిలో ముందస్తు అనుమతితో ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. పలు సమస్యలు, ఇతివృత్తాలపై వెలువడే భిన్నాభిప్రాయాలతో కూడిన ముసాయిదా అది. ఐరాసలో కైలాస దేశ శాశ్వత మహిళా రాయబారిగా చెప్పుకున్న విజయప్రియ నిత్యానంద అభిప్రాయాలను పట్టించుకోబోం’ అని జెనీవాలోని ఐరాస మానవహక్కుల హై కమిషనర్ చెప్పారు. -
కరోనా కట్టడికి నిత్యానంద పచ్చైపత్తిని వ్రతం
సాక్షి, దొడ్డబళ్లాపురం: తానే దేవుడని, పరమశివుడని ఏవేవో గొప్పలు చెప్పుకునే వివాదాస్పద స్వామి నిత్యానంద కరోనా వైరస్‌ను వ్రతం ద్వారా నయం చేస్తానని ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానంద అరెస్టుకు భయపడి పరారై గుర్తుతెలియని చోట ఉన్నారు. అక్కడి నుండి సోమవారం సాయంత్రం ఆయన రామనగర బిడదిలోని తన ఆశ్రమానికి ఈ మెయిల్లో వీడియో పంపాడు. దాని సారాంశం ప్రకారం.. శిష్యులు కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు, కరోనా నివారణకు తాను ధ్యానం,ఉవాసం, పచ్చైపత్తిని వ్రతం ప్రారంభించాను. బిడది ఆశ్రమంలో కూడా శిష్యులు పచ్చై పత్తిని వ్రతం ఆచరించాలి, ధ్యానం సమయంలో ఓం నిత్యానంద పరమ శివోహం అనని జపించాలి. వ్రతంతో పాటు వైద్యులు సూచించిన మందులను సేవించాలి అని వివరించాడు. దీంతో బిడదిలో శిష్యులు పచ్చైపత్తిని వ్రతానికి ఏర్పాట్లు ప్రారంభించారు. చదవండి: ‘కరోనా ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి’ -
నిత్యానందకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఆచూకీ కనుక్కోవాలని ఇంటర్‌పోల్ ప్రపంచ దేశాలను కోరింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్మాతికవేత్త నిత్యానంద గత ఏడాది విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యానంద ఆచూకీ ఉంటే తెలపాలని భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బుధవారం ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక గురువుగా, బోధకుడిగా చెలామణీ అయిన నిత్యానంద పలుచోట్ల ఆశ్రమాలను నడుపుతూ పలువురు భక్తులను ఆకర్షించాడు. ముఖ్యంగా విదేశీయులను వశపరచుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. అలా కోట్లాది రూపాయలను కూడబెట్టాడు. లైంగిక, అత్యాచార ఆరోపణల్లో ఎదుర్కొంటున్నాడు. కొంత కాలం జైలు జీవితాన్ని గడిపిన నిత్యానంద ఇప్పుడు పరారీలో ఉన్నాడు. (నిత్యానందకు ఆశ్రయం; ఈక్వెడార్ క్లారిటి) గుజరాత్, కర్ణాటక పోలీసుల వాంటెడ్ లిస్టులో నిత్యానంద ఉన్నారు. చిన్న పిల్లలను అహ్మదాబాద్ ఆశ్రమంలో బంధించి.. లైంగికంగా వేధించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైన కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్‌లో కైలాసాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ఓ వీడియోలో నిత్యానంద బహిరంగ ప్రకటన విడుదల చేశాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఆయనను ఈక్వెడార్‌లో లేరని, హైతీకి పారిపోయినట్లు ఈక్వెడార్ ఎంబసీ స్పష్టం చేసింది. ఓ దీవిని కొని, దానికి కైలాసం అని నిత్యానంద పేరుపెట్టినట్టు కూడా వార్తలు బలంగా వినిపించాయి. (నిత్యానంద మరో అకృత్యం) -
ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద
న్యూఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి రెచ్చి పోయారు. ఏ వెదవ కోర్టూ తనను ఏమీ చేయలేదని, తానే పరమశివుడినని వ్యాఖ్యానించారు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నన్నెవరూ ముట్టుకోలేరు. నేను మీకు నిజం చెబుతా. నేనే పరమ శివుడిని. అర్థమైందా? ఈ నిజాన్ని ప్రకటించినందుకు ఏ వెదవ కోర్టూ నన్ను విచారిం చలేదు. నేనే పరమశివుడిని. నాదీ గ్యారెంటీ. మీకెవరికీ మరణం లేదు’అంటూ నిత్యానంద వ్యాఖ్యానించడం వీడియోలో కనిపించింది. ఇదిలా ఉండగా దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతిని రవీశ్‌కుమార్ మాట్లాడుతూ అన్ని దేశాల్లోని కార్యాలయాలను అప్రమత్తం చేశామని, నిత్యానంద గురించి స్థానిక ప్రభుత్వాలకు వివరించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. -
నేను పరమశివుణ్ణి.. నన్నెవరూ టచ్ చేయలేరు!
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. తనను ఎవ్వరూ టచ్ చేయలేరంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతూ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి. నిత్యానందపై ఇప్పటికే ఎన్నో కేసులున్నాయి. లెక్కలేనన్ని వివాదాలున్నాయి. కేసుల భయంతో ఎక్కడ తలదాచుకున్నాడో కూడా తెలియదు. కానీ.. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో మాత్రం తనను ఎవ్వరూ టచ్ చేయలేరని నిత్యానంద పేర్కొన్నారు. ఆ వీడియోను పరిశీలిస్తే.. 'నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు.. ఏ స్టుపిడ్ కోర్టు నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు.. నేను పరమశివుడిని.. నేను నిజం చెప్పగలను.. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను' అంటూ తన శిష్యగణాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించాడు. అయితే, అది ఎక్కడ? ఏ సందర్భంలో మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.. కానీ, ఆ వీడియో మాత్రం వైర్‌గా మారిపోయింది. "No judiciary can touch me. M param shiva" : #NithyanandaSwami from an undisclosed location. pic.twitter.com/WXdZ6bGCdO — Divesh Singh (@YippeekiYay_DH) November 22, 2019 వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. చదవండి: నిత్యానంద దేశానికి ప్రధానిగా తమిళనటి? -
నిత్యానందకు ఆశ్రయం; ఈక్వెడార్ క్లారిటి
న్యూఢిల్లీ : వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. దీంతో అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని చెప్పింది. ఈక్వెడార్ నుంచి నిత్యానంద ద్వీపం కొనుగోలు చేసాడని వస్తున్న వార్తలను ఖండించింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది. నిత్యానందకు చెందిన కైలాస వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా పలు కథనాలు వెలువడ్డాయని.. అందులో వాస్తవాలు లేవని తెలిపింది. నిత్యానందకు సంబంధించిన విషయాల్లో ఈక్వెడార్ పేరును వాడటం మానుకోవాలని మీడియాను కోరింది. కాగా, ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తోందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద తనను కాపాడుకోవడానికి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం ఏర్పాటు చేయడమనేది అంత సులువు కాదు: కేంద్రం ప్రభుత్వం నిత్యానంద పాస్‌పోర్ట్ రద్దు చేసిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మాట్లాడుతూ.. గత నెల నుంచి కనబడకుండా పోయిన నిత్యానంద ఆచూకీని కనుగొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కొత్త పాస్‌పోర్ట్‌కై అతను పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు. నిత్యానంద కైలాస దేశంపై స్పందిస్తూ.. ఒక దేశం ఏర్పాటు చేయడం వెబ్సైట్ ఏర్పాటు చేసినంత సులువైన పని కాదని అన్నారు. -
ప్రైవేటు దీవిలో తేలిన నిత్యానంద!
న్యూఢిల్లీ: దొంగ పాస్పోర్టుతో దేశం దాటిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్ దీవుల్లో తేలారు. అక్కడ ఓ ప్రైవేట్ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి కైలాస అని పేరు కూడా పెట్టారు. తన దీవికి దేశం హోదా ప్రకటించాలని కోరుతున్న నిత్యానంద ఆ దేశానికి ప్రత్యేక పాస్పోర్ట్కూడా రూపొందించనున్నాట్టు చెబుతున్నారు. అనేక వివాదాలతో ఇప్పటికే అనేకసార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద..దొంగ పాస్పోర్టుతో దేశం విడిచిపారిపోయాడు. అప్పటినుండి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నిత్యానంద ఆశ్రమం ఖాళీ, బిగుస్తున్న ఉచ్చు
అహ్మదాబాద్: వివాదాస్పద మత బోధకుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు మరోసారి దాడులు నిర్వించారు. పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమాన్ని జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. బాలికల అపహరణ, కిడ్నాప్లాంటి ఇతర క్రిమినల్ అభియోగా నేపథ్యంలో స్థానిక పోలీసులు తాజా దాడులు నిర్వహించారు. ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు. అంతేకాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశయించారు. పిల్లల్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. అయితే పోలీసుల చొరవతో ఇద్దరు కుమార్తెలకు విముక్తి లభించగా, పెద్ద కుమార్తెలిద్దరు నిత్యానంద సంస్థను విడిచి పెట్టడానికి నిరాకరించారు. తన పిల్లలను ఆశ్రమంలో బ్రెయిన్ వాష్ చేసి హింసించారని శర్మ ఆరోపించారు. అయితే వీరిని గుర్తించాల్సిందిగా గుజరాత్ హైకోర్టు నవంబర్ 26న పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఇంటర్‌పోల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారులను కూడా సంప్రదించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. దీంతో కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు పరారీలో ఉన్న నిత్యానందకోసం గాలిస్తున్నారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ) అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఎన్ఓసి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) నిత్యానంద ఆశ్రమాన్ని నడుపుతున్నట్టు నిర్ధారించిన తరువాత అహ్మదాబాద్, హిరాపూర్, దాస్క్రోయిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు మంజూరు చేసిన సీనియర్ సెకండరీ స్థాయి వరకు తాత్కాలిక/సాధారణ ఎఫిలియేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకుందని సీబీఎస్ఇ నోట్‌ను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. అయితే 2020 లో 10, 12 తరగతుల విద్యార్థులను బోర్డు పరీక్షకు హాజరుకావడానికి, తొమ్మిదవ తరగతి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సమీపంలోని సీబీఎస్ఐ-అనుబంధ పాఠశాలలకు మార్చడానికి బోర్డు అనుమతించింది. కాగా అయితే అత్యాచారం కేసులో విచారణను తప్పించుకునేందుకు నిత్యానంద విదేశాలకు పారిపోయినట్టుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్ గడువు 2018 సెప్టెంబర్‌లో ముగిసిందనీ, అత్యాచారం ఆరోపణల కారణంగా రెన్యువల్ చేయలేదనీ ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారో తెలియదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
నకిలీ ఫోటో వైరల్, చిన్మయి వివరణ
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద వైరల్ అవుతున్న తన ఫోటోపై వివరణ ఇచ్చారు. అది మార్ఫింగ్ ఫోటో అని ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. ఇటీవల, లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితుడైన వివాదాస్పద గురువు నిత్యానందతో చిన్మయి, ఆమె తల్లి కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఫోటోను వివరీతంగా షేర్ చేసిన నెటిజనులు ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో స్పందించక తప్పని పరిస్థితుల్లో ఈ ఫోటోపై వివరణ ఇచ్చారు. అయినా షేరింగ్స్ ఆగలేదు. ఈ ఫోటో నకిలీదని నిర్ధారించిన తర్వాత ఈ అభిమానులు మరలా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేశారు. కావాలనే ఇలా చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఫోటోను షేర్ చేశారు. అయితే చిన్మయి ట్వీట్ తరువాత, మార్ఫింగ్ ఫోటో షేర్ చేసిన ట్విటర్ యూజర్ తన ట్వీట్‌ను తొలగించడం గమనార్హం. తన నలుగురు కుమార్తెలను నిత్యానంద ఆశ్రమంలో చట్టవిరుద్ధంగా నిర్బంధించి, వేధింపులకు గురిచేశారంటూ ఒక కుటుంబం చేసిన ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో ‘సేవ్ గరల్స్ ఫ్రమ్ నిత్యానంద’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అయింది. సాధారణంగా ఇలాంటి సమస్యలపై తరచుగా స్పందించే చిన్మయి ఈ సమస్యపై కూడా స్పందించారు. మతపరమైన స్వాములు, భక్తి ముసుగులో జరుగుతున్న ఇలాంటి అక్రమాలుఎన్నిసార్లు వెలుగులోకి వస్తున్నా..ఇవి ఎంత ప్రమాదకరమైనవి అనేదానిపై పదేపదే ఆధారాలు ఉన్నప్పటికీ, ప్రజలు అర్థం చేసుకోలేక వారి మాయలో పడిపోతున్నారని చిన్మయి ట్వీట్ చేశారు. దీనిక ప్రతిగా స్పందించిన ఒక వినియోగదారుడు నిత్యానంద నుంచి చిన్మయి, ఆమె తల్లి ప్రసాదం స్వీకరిస్తున్నట్టుగా ఉన్న ఒక ఫేక్ ఫోటో షేర్ చేయడంతో దుమారం రేగింది. తమిళం, తెలుగుతోపాటు అనేక ఇతర భాషలలో పలు సూపర్ హిట్ పాటలతో చిన్మయి ప్రాచుర్యం పొందారు. అంతేకాదు త్రిష, సమంతా వంటి టాప్ హీరోయిన్లకు తన గొంతు అరువిచ్చి ఆయా పాత్రలకు ప్రాణం పోసారు. దీనితోపాటు తమిళ చిత్ర పరిశ్రమలో మీ టూ ఉద్యమంలో చిన్మయి పాత్ర చాలా చురుకైనది. చదవండి : ‘నా కుమార్తెను చంపేశారు’: నిత్యానంద మరో అకృత్యం I dont why these fans are doing this all over again after I have established that this photo is fake. Are they doing this for free or is this paid? https://t.co/pHirTu6500 pic.twitter.com/j4GhpRCHGr — Chinmayi Sripaada (@Chinmayi) November 25, 2019 -
‘నా కుమార్తెను చంపేశారు’ : నిత్యానంద మరో అకృత్యం
సాక్షి, బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద అకృత్యాలకు సంబంధించి మరో హృదయ విదారక గాథ తాజాగా వెలుగులోకి వచ్చింది. నిత్యానంద ఆశ్రమంలో అమ్మాయిలను (శిష్యులను) భక్తి ముసుగులో లోబర్చుకోవడం, లైంగిక వేధింపులతో నరకం చూపిస్తున్నారంటూ కలకలం రేపిన ఇటీవలి కథనాలు, బాలికల మాయం ఉదంతాలు వెలు చూసిన అనంతరం ఓ బాధిత తల్లి తన గోడును మీడియా ముందు వెల్లడించారు. 2014లో నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తెను హింసించి, దారుణంగా హత్య చేశారని ఝాన్సీ రాణి అనే మహిళ ఆరోపించారు. బిడ్డను, భర్తను కోల్పోయాను.. కుటుంబం మొత్తం సర్వ నాశనమైపోయింది. తనలాంటి దుస్థితి మరెవ్వరికీ రాకూడదు..దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. ఇండియా టుడే టీవీ కథన ప్రకారం నిత్యానంద బెంగళూరు ఆశ్రమంలో తన కుమార్తె సంగీత అర్జున్ను అక్రమంగా బంధించి, హత్యచేశారని ఝాన్సీరాణి ఆరోపణ. త్రిచికి చెందిన సంగీత అర్జునన్ 2008 - 2014 కాలంలో నిత్యానంద ఆశ్రమంలో కంప్యూటర్ విభాగానికి హెడ్‌గా పనిచేసేది. మరణించే నాటికి (డిసెంబర్28, 2014) ఆమె వయసు 24 మాత్రమే. ఆశ్రమంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో సంగీత జీవిస్తున్న విషయాన్ని గమనించి ఆమెను ఇంటికి తీసుకొచ్చానని, అయితే వెంటనే నలుగురు వ్యక్తులు వచ్చి బలవంతంగా సంగీతను తీసుకెళ్లారని, పైగా ఆశ్రమనుంచి ఎత్తుకొచ్చావంటూ తనమీదే కేసు పెడతామని బెదిరించాని ఆమె పేర్కొన్నారు. ఆ తరువాత తన బిడ్డను మళ్లీ సజీవంగా చూడలేకపోయానని ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు. ఆశ్రమంలో ఉండే హంసానంద, ప్రణయానంద ఇద్దరూ కనీసం తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడటానికి అనుమతించలేదని రాణి చెప్పారు. చాలాసార్లు ఆశ్రమానికి సంగీతను కలవడానికి వెళ్లి...గంటల తరబడి గేటు ముందు వేచి చూసినా ఫలితం లేదని, చివరకు గుండెపోటుతో చనిపోయిందంటూ ఆమె మృతదేహాన్ని అప్పగించారని వాపోయారు. కచ్చితంగా తన బిడ్డను హత్య చేశారని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును చేపట్టాలని ఆమె కోరుతున్నారు. అంతేకాదు సంగీత అంత్యక్రియలు కూడా ఆశ్రమంలోనే చేయాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యారని ఝాన్సీ రాణి చెప్పారు. అంత్యక్రియలు నిర్వహించడానికి తన కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని పట్టుబట్టడంతోనే మొదటి పోస్ట్‌మార్టం జరిగిందని ఆమె తెలిపారు. అయితే సంగీతం మృతదేహంపై కాళ్లపై వాపు, బ్లడ్ క్లాట్స్ బంధువులు గమనించడంతో బెంగళూరులోని రాంగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతోపాటు, రెండవసారి పోస్ట్‌మార్టం కోసం పట్టుబట్టినట్టు ఆమె చెప్పారు. దీంతో ఆమె శరీరంలోని అవయవాలన్నీ మాయమయ్యాయని రెండవ పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. అయితే మొదటి శవపరీక్షలో వాటిని తొలగించినట్టు గత ఏడాది హైకోర్టు జడ్జికి తెలిపారన్నారు. కర్ణాటక కోర్టులో కేసు వేసి ఐదేళ్ళు అయ్యింది. గత ఏడాది ఈ కేసులో సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. కానీ ఆ తరువాత పదిరోజుల్లోనే ఆ సదరు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో విచారణలో ఎలాంటి పురోగతి లేదని, ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించి బీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. సంగీత చనిపోయిన రెండేళ్లకే కుమార్తె చనిపోయిన బాధతో కుమిలిపోయిన తన భర్త కూడా ఈ లోకాన్ని వీడారని, నిత్యానంద నిర్వాకంతో సర్వం కోల్పోయానని ఝాన్సీరాణి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కుటుంబంలో గుండెపోటు వ్యాధికి సంబంధించిన హిస్టరీ ఉన్న కారణంగా జెనెటిక్‌గా వచ్చిన గుండెపోటుతో అతి చిన్న వయసులోనే సంగీత చనిపోయిందని ఆశ్రమ వర్గాలు తమ వెబ్సైట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా స్వామి ముసుగులో ఆశ్రమంలో లైంగిక కార్యకలాపాలు, అత్యాచార ఆరోపణలను ఇప్పటికే ఎదుర్కొంటున్న నిత్యానందపై మరోసారి తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. అమ్మాయిలతో బలవంతపు విరాళాలు వసూలు కోసం పిల్లలను కిడ్నాప్ చేసి, తప్పుగా నిర్బంధించినందుకు నిత్యానందపై గత వారం కేసు నమోదైంది. అయితే నిత్యానంద దేశం విడిచి పారిపోయాడని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అర్ధరాత్రి నిద్రలేపి.. వీడియోలు చేయాలంటూ..
అహ్మదాబాద్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఆశ్రమంలో జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. విద్య పేరిట బాలికలను ఆశ్రమంలో చేర్పించుకుని.. వారి ద్వారా విరాళాలు సేకరించేందుకు అవలంబిస్తున్న విధానాలను బెంగళూరుకు చెందిన బాలిక మీడియాకు వెల్లడించింది. బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ దంపతులు తమ నలుగురు కూతుళ్లను 2013లో నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులు... ఇటీవల ఆ నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న యోగిన సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకన్న శర్మ దంపతులు కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా.. అందుకు నిరాకరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఇద్దరు మైనర్ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మేజర్లు అయిన మరో ఇద్దరు కూతుళ్లు మాత్రం వారి వెంట రావడానికి నిరాకరించారు. ఈ క్రమంలో తమ కూతుళ్లను విడిపించాల్సిందిగా శర్మ దంపతులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శర్మ దగ్గరికి వచ్చిన కూతురు(15) ఒకరు మాట్లాడుతూ... నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా తమను వేధింపులకు గురిచేసేవారని పేర్కొంది. ‘2013 మేలో గురుకులంలో చేరాను. మొదట్లో అన్నీ బాగానే ఉండేవి. చాలా సరదాగా గడిచిపోయేది. అయితే 2017 నుంచి మాకు నరకం మొదలైంది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు మాతో ప్రమోషనల్ వీడియోలు చేయించేవారు. లక్షల్లో విరాళాలు వచ్చేలా నటించాలంటూ ఇబ్బంది పెట్టేవారు. రూ. 3 లక్షల నుంచి ప్రారంభమై... రూ. 8 కోట్ల వరకు విరాళాలు వచ్చేవి. నగదు చెల్లించలేని వాళ్లు భూముల రూపంలో అది కూడా ఎకరాల్లో దానంగా ఇచ్చేవారు. ఆ వీడియోల కోసం అర్ధరాత్రి మమ్మల్ని నిద్రలేపేవారు. మాకు బాగా మేకప్ వేసి.. పెద్ద పెద్ద నగలు అలంకరించి స్వామీజీ వద్దకు తీసుకువెళ్లేవారు. మా అక్కను కూడా అలాగే చేశారు. నా ముందే తనతో వీడియోలు చేయించేవారు. మా అమ్మానాన్నలకు వ్యతిరేకంగా మాట్లాడాలని వేధించారు. నన్ను కూడా అలాగే చెప్పమన్నారు కానీ నేను వినలేదు. దాంతో ఇష్టం వచ్చినట్లుగా, అసభ్యరీతిలో దూషించారు’ అని చెప్పుకొచ్చింది. ఇక బాలిక తండ్రి జనార్ధన శర్మ మాట్లాడుతూ.. తన ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారని తెలిపారు. తన కూతుళ్లకు మాయమాటలు చెప్పి తన వద్దకు రాకుండా చేస్తున్నారని వాపోయారు. విచారణ వేగవంతం చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి. -
ఆయన పురుషుడే!
కోర్టుకు చేరిన నిత్యానంద పురుషత్వ పరీక్షల నివేదిక 31 పేజీల నివేదికను అందజేసిన సీఐడీ కేసు విచారణ డిసెంబర్ 3కు వాయిదా బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సంబంధించిన పురుషత్వ పరీక్షల నివేదిక రామనగర సెషన్స్ కోర్టుకు బుధవారం చేరింది. తాను ఆరేళ్ల బాలుడులాంటి వాడినని అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని నిత్యానంద గతంలో కోర్టుకు విన్నవించిన విషయం తెల్సిందే. అయితే పురుషత్వ పరీక్షల్లో ఆయన ‘ పురుషుడే’ అని నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కేసు విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అత్యాచార ఆరోపణలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిత్యానందకు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో నిపుణుల సమక్షంలో పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన 31పేజీల నివేదికను కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగం డీఎస్పీ లోకేష్ బుధవారం రామనగర్‌లోని సెషన్స్ కోర్టుకు అందించారు. ఇదే కేసుకు సంబంధించి ఆయనకు నిర్వహించిన ధ్వని సంబంధ పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. విచారణ సందర్భంగా నిత్యానందతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఆయన శిష్యులు కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు నిపుణుల నిర్వహించిన పరీక్షల్లో నిత్యానంద తన వయసు తగ్గట్టు శారీరక, మానసిక పరిపక్వత చెందారని... అందువల్ల ఆయన పురుషత్వ పరీక్షల్లో ‘పాస్’ అయినట్లు తేలిందని విశ్వసనీయ సమాచారం.