
ఎటకారం సినిమా విజయ్ కి అంకితం
గుంటూరు : నేపాల్ భూకంప దుర్ఘటనలో మృతి చెందిన ఎటకారం సినిమా నటుడు విజయ్ సింగ్ అంత్యక్రియలు గురువారం బాపట్లలో జరిగాయి. అంతకు ముందు విజయ్ సింగ్ భౌతికకాయానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి నివాళులు అర్పించారు. అలాగే ఎటకారం చిత్ర యూనిట్ కూడా విజయ్కు ఘనంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కిషన్ మాట్లాడుతూ ఎటకారం సినిమాను విజయ్ సింగ్కు అంకితమిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు వచ్చే లాభంలో కొంత మొత్తాన్ని విజయ్ సింగ్ కుటుంబానికి ఇస్తామని ఆయన తెలిపారు.