జనం పాట్లు పట్టని ప్రభుత్వం
జనం పాట్లు పట్టని ప్రభుత్వం
Published Tue, Dec 20 2016 12:01 AM | Last Updated on Sat, Jun 2 2018 5:51 PM
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి
బ్యాంక్ అధికారుల దృష్టికి పింఛన్‌దారుల పాట్లు
కోరుకొండ : పెద్దనోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలతో పాటు పింఛన్‌దారులైన దివ్యాంగులు, వితంతువులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బ్యాంకుల వద్ద నిత్యం నరకయాతన పడుతున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పింఛన్‌దారులు పడుతున్న సమస్యలను సోమవారం ఆమె తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ స్టేట్ బ్యాంకు మేనేజరు ద్వారంపూడి వెంకటకృష్ణారెడ్డి, పశ్చిమ గానుగూడెం ఆంధ్రా బ్యాంకు మేనేజరు పీఎస్ రాజాలకు వివరించారు. నడవలేని స్థితిలో ఉన్న కోటికేశవరానికి చెందిన గుడేలి కాంతమ్మ (బధిర వృద్ధురాలు), బొల్లెద్దుపాలెంకు చెందిన వికలాంగురాలు గోలి గన్నెమ్మలను వారి వద్దకు తీసుకెళ్లి వారి వెతలను వినిపించారు. పింఛన్‌దారులతో పాటు రైతులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు నగదు కోసం చాలా అవస్థలు పడుతున్నారన్నారు. ఏటీఎంలలో కూడ నగదు ఉండడం లేదని ఆరోపించారు. పింఛన్‌దారులలో కొందరు ఏటీఎం కార్డులు, బ్యాంకు అకౌంట్ల కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. పింఛన్‌దారులందరికీ నేరుగా పంచాయతీల ద్వారా నగదు బట్వాడా చేయాలని డిమాండ్ చేశారు. పోస్టాఫీసులలో చాలా రోజులుగా నగదు ఇవ్వడం లేదని ఆరోపించారు. పింఛన్‌దారులు, బ్యాంకు వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, జిల్లా కార్యదర్శులు చింతపల్లి చంద్రం, అయిల శ్రీను, మండల బీసీ సెల్ కన్వీనర్ సూరిశెట్టి భద్రం, రాష్ట్ర యూత్ కార్యదర్శి బొరుసు బద్రి, మండల యూత్ అధ్యక్షుడు అడపా శ్రీను, మండల అధికార ప్రతినిధులు గరగ మధు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, కోరుకొండ యూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి సత్తిరెడ్డి, పసుపులేటి బుల్లియ్యనాయుడు, విద్యార్థి విభాగం నాయకుడు వుల్లి గణనాథ్, ఎంపీటీసీ వుల్లి చెల్లారావు, రైతు నాయకులు గింజాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
కరెన్సీ కష్టాలు తీర్చాలి.
కరెన్సీ కష్టాలను తక్షణం తీర్చాలని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద తగినంత నగదు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం కోరుకొండలో ప్రదర్శన నిర్వహించారు. పింఛనుదార్లకు ఆయా పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్లు అందించాలని; రైతులు, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగదు ఇవ్వాలని; వృద్ధులు, వికలాంగులకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement