jakkampudi
-
జక్కంపూడి రాజాను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
-
దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోం జక్కంపూడి రాజా వార్నింగ్
-
కలవచర్ల గ్రామంలో పార్ను ప్రారంభించిన మంత్రి అమరనాథ్
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చదవండి: ‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ -
ఆ ఇళ్లు.. బడుగుల ఆత్మగౌరవ సౌధాలు
ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం వెలుగులు నింపుతోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అలాగే, పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీకి ‘సాక్షి’ వెళ్లి తెలుసుకుంది. రోజంతా నా భర్త వెంకటేశ్వరరావు కూలికెళ్తే వచ్చే డబ్బు ఇద్దరు పిల్లల పెంపకం, కుటుంబ పోషణకే సరిపోయేది. దీంతో చాలాసార్లు అద్దె ఇంట్లోకి వెళ్దామనుకున్నా ఆర్థిక స్థోమత సహకరించక ఆ ప్రయత్నం విరమించుకున్నాం. గుడిసెల్లో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. వర్షం వస్తే పైకప్పు నుంచి నీరు ధారలా కారుతుండేది. దీంతో పిల్లలను నేను, నా భర్త ఒళ్లో పడుకోబెట్టుకుని, పురుగు పుట్రా వస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ బతికాం. మా పరిస్థితి చూసి బంధువులెవరూ పెద్దగా ఇంటికి వచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడా అవస్థలు మాకులేవు. మేం ఉంటున్న గుడిసెలను ఖాళీ చేయించి ఇక్కడే మాకు ప్రభుత్వం ఇళ్ల పట్టా ఇవ్వడమే కాక ఇంటిని కూడా నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం అందులో దర్జాగా ఉంటున్నాం. ఇదంతా తల్చుకుంటే నిజంగా కలలాగే ఉంది. కేవలం మాకు గూడు కల్పించడమే కాదు.. నా బిడ్డల చదువుకు అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. అంతేకాక.. వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండుసార్లు రూ.10వేల చొప్పున లబ్ధిపొందాను. గతంలో ఏ ప్రభుత్వం మాకు ఇంతలా సాయపడలేదు. మా బతుకు చిత్రాన్నే మార్చిన ముఖ్యమంత్రి జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – కవిత, జక్కంపూడి, విజయవాడ రూరల్ మండలం పూరి గుడిసెల్లో ఉన్నప్పుడు ఏటా రెండుసార్లు పైకప్పు మార్చాల్సి వచ్చేది. ఇందుకు రూ.20వేలకు పైగానే ఖర్చయ్యేది. నా భర్త కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ నేను కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. కుటుంబ పరిస్థితులు సరిగాలేక నా కొడుకు పదో తరగతితో చదువు మానేసి ఫ్యాక్టరీలో పనికెళ్తున్నాడు. అమ్మాయి ఇంటి వద్దే ఉంటుంది. దీనావస్థలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంది. పక్కా ఇంటిని నిర్మించి ఇచ్చి ఎంతో మేలు చేసింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండుసార్లు రూ.17 వేల చొప్పున ఆర్థిక సాయం అందింది. సున్నా వడ్డీ, ఇతర పథకాలు మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నాయి’’. – వి. పద్మ, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం .. ఇలా ఎంతో మంది పేదల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం వెలుగులు నింపుతోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అలాగే పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు నా భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. మేం కూడా పూరి గుడిసెలో ఉండే వాళ్లం. గత ప్రభుత్వ హయాంలో స్థలం, ఇంటికోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మాకు స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాకే నాకు వితంతు పింఛన్ మంజూరైంది. పూరిగుడిసెల్లో ఉన్నపుడు వర్షం కారుతుండేది. పాములు, తేళ్లు కుట్టి ఆస్పత్రులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పడు మాకంటూ ఒక ఇల్లుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంతేకాదు.. మా కాలనీ వద్దకే రేషన్ బండి కూడా వస్తోంది. – అవనిగడ్డ లక్ష్మి, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం మా కష్టాలు తీరాయి.. నాకు పెళ్లి కాకముందు నుంచి నా భర్త కుటుంబం పూరి గుడిసెలో ఉంటోంది. నాకు ఇద్దరు పిల్లలు. బాలింతగా ఉన్న సమయంలో చలికాలం, వర్షాకాలం చిన్న పిల్లలతో గుడిసెలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఐదు, ఆరు మంది చిన్న గుడిసెలో ఉండేవాళ్లం. మేం పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఉండటానికి ఇల్లులేక, అద్దెలు కట్టడానికి స్థోమత లేని మాలాంటి నిరుపేదల కష్టాలు అనుభవించే వారికే తెలుస్తుంది. జగనన్న పుణ్యమా అని మా కష్టాలన్నీ తీరాయి. సొంతింట్లో ఉంటున్నాం. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. – వి. సీతమ్మ, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం ఇప్పుడు వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీకి ‘సాక్షి’ వెళ్లింది. అక్కడి ఎస్టీ మహిళలతో మాట్లాడితే వారు పైవిధంగా స్పందించారు. అంతా కలలా ఉందని చెబుతుంటే వారి కళ్లల్లో ఎంతో సంతోషం సాక్షాత్కరించింది. 42 ఇళ్ల నిర్మాణం పూర్తి.. జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీలో పేదలకు 156 ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 136 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. ఇప్పటికే 42 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ 42 ఇళ్లలో 20కు పైగా ఇళ్లు గతంలో ఇక్కడే పూరిగుడిసెల్లో నివాసం ఉండే ఎస్టీలకు సంబంధించినవి. మరో 30 ఇళ్లు శ్లాబ్ దశ పూర్తయి ఫినిషింగ్ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.3 లక్షల మేర ఉంటుంది. ఇంత ఖరీదైన స్థలాలను ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తోంది. ఉచితంగా ఇసుక, మార్కెట్ ధరల కన్నా తక్కువకు నిర్మాణ సామగ్రి అందిస్తోంది. మూడు శాతం వడ్డీకి రూ.35వేల బ్యాంకు రుణాలు అందిస్తూ అదనపు సాయం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నిరుపేదలకు గూడు జక్కంపూడి గ్రామానికి చెందిన ఎస్టీలు, ఇతర నిరుపేద కుటుంబాల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిలువ నీడలేని పేదలకు సీఎం జగన్ ప్రభుత్వం సొంత గూడు కల్పిస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30 లక్షల మందికి పైగా పేదలకు పక్కా గృహాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా.. 30.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వగా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. జక్కంపూడి గ్రామంలోని ఎస్టీల తరహాలో ఇళ్లు నిర్మించుకునే స్థోమతలేని నిరుపేదల కోసం ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఇచ్చారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా 3.24 లక్షల మంది ఎంచుకున్నారు. లాభాపేక్ష లేకుండా ఈ ఇళ్లను నిర్మించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు 10–20 మంది లబ్ధిదారులను గ్రూప్‌గా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. (జక్కంపూడి జగనన్న కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్) -
దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి గ్రామస్తులు..
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమకు జక్కంపూడి - షాబాద్ గ్రామస్తులు షాకిచ్చారు. ఎప్పటిలానే మాజీ మంత్రి ఉమ తనదైన శైలిలో నలుగురిని వెంటేసుకొని గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులు అక్కడకు చేరుకొని మాజీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఎదురుతిరిగి ప్రశ్నించడంతో దేవినేని ఉమ, అతని అనుచరులు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. (ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం) ఈ సందర్భంగా గ్రామస్తులు.. మా పేదల దగ్గర నుండి భూములు తీసుకున్న మీరు మాకు ఇళ్లు ఇవ్వకుండా ఎక్కడో విజయవాడలో ఉండే వాళ్ళకు ఎందుకు ఇచ్చారు..?. మాకు న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చి భూములు తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ స్థానికులు ఎదురుతిరగి ప్రశ్నించడంతో మాజీ మంత్రి అక్కడ నుండి తోకముడిచి పారిపోయారు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్య!
సాక్షి, విజయవాడ : జక్కంపూడిలో దారుణం చోటుచేసుకుంది. భార్య కృష్ణ కుమారిపై అనుమానంతో అవనిగడ్డ నరసింహారావు గొడ్డలితో నరికి హత్య చేసి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. భార్యను హత్య చేసిన అనంతరం భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఉన్న గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్య!
-
నీరు లేకుండా జాతికి అంకితమా!
వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పురుషోత్తపట్నం పథకంపై ఎద్దేవా సీతానగరం (రాజానగరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిమిక్కులతో ప్రజలను మోసం చేయవచ్చని అనుకుంటున్నారని, వాటిని మానుకోవాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సూచించారు. బుధవారం సీతానగరంలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పలు విధాలుగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, ఆయన మాటలు ప్రజలు నమ్మడం లేదని గుర్తు చేశారు. దీనికి నిదర్శనం నంద్యాల ఎన్నికలేనన్నారు. రూ 1,640 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నెలకొల్పి, కమీషన్లు రూపంలో వందలాది కోట్లు తమ జేబులో వేసుకుంటున్నారన్నారు. పథకం పనులు పూర్తి కాకుండానే చంద్రబాబు జాతికి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పలుమార్లు జాతికి అంకితం చేశారని, అలాగే పురుషోత్తపట్నం పథకాన్నీ ప్రారంభిస్తారన్నారు. పరిహారం అందించడకుండా రైతులను గృహనిర్బంధాలు చేసి, సెక్షన్ 30, 144 వంటి పలు సెక్షన్లు రాష్ట్రంలో ఉంచి పాలన జరిపే ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ నెల 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రార ంబోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు మోటార్లను తిప్పి నీరు వచ్చిందని భావించి గొప్పగా జాతికి అంకితం చేశామని డప్పులు కొట్టుకునే రీతికి టీడీపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. పోలవరం ఎడమ కాలువలోకి పరుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి చుక్క నీరు కూడా రాలేదని, పైప్‌లైన్ పనుల పూర్తి కాకుండానే పథకాన్ని జాతికి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని కించపరుస్తూ సీఎం అంటే, మేము తీసిపోలేదన్నట్లుగా ఎస్సీలు చదువుకోరు, శుభ్రంగా ఉండరు అని టీడీపీ మంత్రులు అంటున్నారని, ఎస్సీలను ఎప్పటికప్పుడు హేళన చేసి మాట్లాడటం సరికాదని హితవుపలికారు. పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చల్లమళ్ల సుజీరాజు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదితరులు పాల్గొన్నారు. -
జక్కంపూడి విజయలక్ష్మిని అడ్డుకున్న పోలీసులు
నిర్వాసితులకు పునరావాసం ఏదీ...? - వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్న ఎత్తిపోతల పథకం పనుల పరిశీలినకు సీఎం వస్తున్నారని ఖాళీ చేయించిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఎక్కడని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. మంగళవారం పురుషోత్తపట్నంకు వెళ్లడానికి వచ్చిన జక్కంపూడి విజయలక్ష్మిని రఘుదేవపురం రవీంద్ర కాలనీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎస్సై ఎ. వెంకటేశ్వరావు జక్కంపూడిని అడ్డుకుని, సీఎం కార్యక్రమం ఉన్నందున వెళ్లరాదని అవరోధం సృష్టించినా ‘ససేమిరా’ అనండంతో కోరుకొండ సీఐ మధుసూదనరావుతోపాటుగా సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది తరలివచ్చి విజయలక్ష్మితో చర్చించారు. ఏటిగట్టుపై ఉంటున్న వారికి ఖాళీ చేయించారని, వారు గత ఏభై ఏళ్లుగా ఉంటున్నారని, తొలగించి వారికి స్థలాలు కేటాయింస్తామని తహసీల్దార్ తెలిపారని, వారికి తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ స్పందించి స్థలాల విషయం తాను తెలుసుకుంటానని, సీఎం కార్యక్రమం ఉన్నందున అటువైపు వెళ్లరాదని నచ్చజెప్పారు. దీంతో జక్కంపూడిì విజయలక్ష్మి వెనుతిరిగారు. జక్కంపూడి విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ పుష్కర పథకం ప్రారంభోత్సవానికి యూపీఏ చైర్పర్సన్ సోనియా వచ్చినా ఎవరినీ నిర్వాసితులుగా చేయలేదన్నారు. ప్రజలను మోసం చేయడానికే... పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో ప్రజలను మోసం చేస్తున్నారని విజయలక్ష్మి ఆరోపించారు. పనులు కాకుండానే పథకం ప్రారంభోత్సవాలేమిటని ప్రశ్నించారు. రైతులకు ఇళ్ల నుంచి కదలకుండా పోలీసులను ఏర్పాటు చేస్తున్నారని, రైతుల గొంతును నొక్కిపట్టి పథకాలను ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రావు, మద్దాల అను తదితరులు పాల్గొన్నారు. -
కాపు ఉద్యమాన్ని అణచివేస్తే తిరుగుబాటు
– అభివృద్ధి పనులు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం – పోలీసులను రోడ్లు పాలు చేసి అరాచకాలు సృష్టిస్తున్న చంద్రబాబునాయుడు – వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విమర్శ భ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. ముద్రగడ పాదయాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా రాజమహేంద్రవరంలో గురువారం పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు విస్మరించిందని అన్నారు. పుష్కర కాలువ ఎత్తిపోతల పథకం ద్వారా 1.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తే రైతులు పంటలు పండించుకొని లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రైతులకు నీరు అందించే విషయం మర్చిపోయి కాపు ఉద్యమం అణచివేతపై దృష్టి సారించిందని ఎద్దేవా చేశారు. కాపు ఉద్యమం పోలీసులతో అణచి వేసేందుకు పోలీసులను రోడ్డు పాలు చేశారని అన్నారు. వారి విధులు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని అన్నిచోట్లా అవినీతి పెచ్చుమీరిందని అన్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీని తలపిస్తున్న రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎమ్మర్జన్సీని తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ, గ్రేటర్ రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం ఆయనను ప్రకాష్‌నగర్ సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం పొడవునా 144 ,30 సెక్షన్ల అమలు చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి నాయుడు, అడబాల శ్రీను, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, మోర్త పవన్‌మూర్తి, గడుగుల సత్యనారాయణ, దొడ్డి వెంకటేష్, కొప్పిశెట్టి గాంధీ, యమన నారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. -
హిట్లర్ పాలనను తలపిస్తోంది
టీడీపీ ప్రభుత్వంపై జక్కంపూడి ఆగ్రహం ధవళేశ్వరంలో 23 మంది కాపు నాయకుల అరెస్టు ధవళేశ్వరం : రాష్ట్రంలో హిట్లర్ పాలన తలపించే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలనను సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. శనివారం ఆమె ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కాపు సంఘ నాయకులను కలిసి సంఘీభావం తెలిపారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలు దేరిన కాపు సంఘ నాయకులను పోలీసులు స్టేషన్ సెంటర్లో అడ్డుకున్నారు. అక్కడే నిరసనకు దిగిన కాపు సంఘ నాయకులను అరెస్ట్ చేశారు. విషయం తెలసుకున్న జక్కంపూడి విజయలక్ష్మి ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ చేరుకొని దక్షిణ మండల డీఎస్పీ నారాయణరావుతో చర్చించారు. అనంతరం అరెస్ట్ అయిన కాపు నాయకులను విడుదలచేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కాపులపై వివిధ సెక్షన్లు ప్రయోగిస్తూ చంద్రబాబు వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కాపు ప్రజాప్రతిని«ధులు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ భూములను గంటా శ్రీనివాసరావుకు, అంగన్వాడీ కేంద్రాలను మంత్రి నారాయణకు నజరానాగా ఇవ్వడం వల్లనే వారు విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ధవళేశ్వరం బస్టాండ్సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. కాపు సంఘ నాయకులు పెన్నాడ జయప్రసాద్, మెండా సత్తులు, గరగ శ్రీనివాసరావు, బండారు బంపి, దొండపాటి శ్రీనివాస్, సాధనాల చంద్రశేఖర్ (శివ), ఏజీఆర్ నాయుడు, ముత్యాల పోసికుమార్, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, యడ్ల వెంకటేష్, అల్లంపల్లి ముత్యాలు, పందిళ్ల భానుప్రసాద్, దూది సాయి, నూకరాజు, గపూర్, గాలి ప్రసన్నకుమార్, దళిత సంఘ నాయకులు రేగుళ్ల రఘు, మిరప రమేష్, రాజేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నియంతృత్వ పాలన
–వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కడియం : రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. కడియం మండలం వేమగిరిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు స్వగృహంలో గురువారం ఆమె విలేకర్లుతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లోకి చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కాపులను మోసగించారన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు. వేలాది మంది పోలీసులను రోడ్డు ఎక్కించారని రాష్ట్రంలో న్యాయం కోసం ఎవరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా పోలీస్‌స్టేషన్‌లో ఎవరూ లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అది మరింత ఎగిసిపడుతుందన్నారు. 72 గంటల్లో ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. దివంగత నేత వంగవీటి మోహనరంగా హత్యానంతరం ప్రభుత్వానికి ప్రజలు చెప్పిన విధంగానే రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర హోంశాఖామంత్రి నిమ్మకాల చినరాజప్పను చంద్రబాబునాయుడు కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్న నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి కాపుల కోసం పోరాడిన ఘనత ముద్రగడ పద్మనాభానికి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు మాట్లాడుతూ ముద్రగడను విమర్శించే అర్హత మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుకు లేదని పేర్కొన్నారు. -
రాష్ట్రంలో నిరంకుశ పాలన
వైఎస్సార్సీపీకి చెందిన కాపునేతలపై అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ : రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మంగళవారం కోరుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతగా మారాడని జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు.ఎన్నికల్లో చంద్రబాబు కాపు కులస్తులను బీసీ జాబితాలో చేరుస్తానని , కాపు కులాల వారు అడకుండానే హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హమీని అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తుంటే దానిని అడ్డుకోవడం దారుణమన్నారు. హిట్లర్ మించి చంద్రబాబు పాలన ఉందని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభంతో ఫొటో దిగినా, ముద్రగడ ఫొటోతో ఫ్లెక్సీ వేసుకున్న వారిపై కూడా కేసులు పెట్టడడం సిగ్గుచేటన్నారు. కాపు కులస్తులను అన్ని విధాలా చంద్రబాబు పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు ఎలా చూస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. విచిత్రం ఏమిటంటే వైఎస్సార్సీపీకి చెందిన కాపు నేతలు, రైతులకు నోటీసులు ఇస్తూ, బైండోవర్ కేసులు పెడుతున్నారని, టీడీపీ చెందిన కాపు నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాపు కులస్తులను ముద్రగడ పద్మనాభం పాదయాత్ర పేరుతో వేధిస్తున్నారని, కాపు కులస్తులు భయపడేది లేదన్నారు. కాపు కులస్తులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు బొరుసు బద్రి, తోరాటి శ్రీను, ఆరిబోలు చినబాబు, పాలం నాగవిష్ణు, యర్రంశెట్టి పొలారావు, వుల్లి ఘణ, దేవన దుర్గాప్రసాద్, చిక్కిరెడ్డి సురేష్, దేవన బాబీ, దోసపాటి దుర్గారావు, మారిశెట్టి అర్జునరావు , గుగ్గిలం భాను తదితరులున్నారు. -
జేబులు నింపుకోవడానికే పథకాలు
–వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజం –పైప్‌లైన్ పైకి లేవడంపై ఎద్దేవా –సీఎం వస్తున్నారని వీధిన పడిన నిరుపేదలు సీతానగరం (రాజానగరం): అధికార పార్టీ జేబులు నింపుకోవడానికే ఈ ఎత్తిపోతల పథకాలని, వేలాది కోట్లు కేటాయించి అనుయాయులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విరుచుకుపడ్డారు. బుధవారం పురుషోత్తపట్నంలో సీఎం చంద్రబాబు వస్తున్నారని నిరుపేదల ఇళ్లను తొలగించడంపై ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెబుతున్న చంద్రబాబుకు ఈ ఎత్తిపోతల పథకాలు ఎందుకని ప్రశ్నించారు. వచ్చే నెలలో ప«థకం నుంచి నీటిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అయితే మరోపక్క వేసిన పైప్లైన్లు నీటితో పైకి లేచి పోతున్నాయని ఎద్దేవా చేశారు. నాణ్యతా లోపంతో చేస్తున్న పనుల కారణంగానే ఈ విధంగా జరిగిందని ఆరోపించారు. రైతులను నష్టపర్చుతారా... తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ నుంచి ఈ నెల 18న ఎమ్మెల్యే చేతుల మీదుగా సాగునీరు విడుదల చేసి, ఒక్క గంటలో నీటి విడుదల ఆపివేశారని విరుచుకుపడ్డారు. టీపీ స్కీమ్‌లో మండలంలో 13,500 ఎకరాల సాగు అవుతుందని, రైతులకు వరినాట్లు వేసే సమయంలో నీటిని నిలిపివేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు, జిల్లా కమిటి కార్యదర్శి వలవల వెంకట్రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొంచ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేయాలి
– కలెక్టర్‌కు విన్నవించిన జక్కంపూడి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సాక్షి, రాజమహేంద్రవరం: పుష్కర ఎత్తిపోతలు, సత్యసాయి తాగునీటి పథకం, పోలవరం ఎడవ కాలువలో ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు తాజాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఉన్న కాస్త భూమిని కూడా కోల్పోతున్నారని, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రను కలిశారు. అవార్డు నోటీసులు రైతుల ఇంటికి వెళ్లి ఇవ్వకుండా వారి పోలాలల్లోని రాళ్లకు, స్తంభాలకు అంటించడం దారుణమన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలని అడిగిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించడం సరికాదన్నారు. రైతుల భూములు తీసుకుని తిరిగి వారిపైనే కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కేసుల ఎత్తివేతపై సానుకూల దృక్ఫథంతో ఆలోచించాలని కోరారు. వారి వెంట వామపక్ష నేతల అరుణ్, నల్లా రామారావు, వైఎస్సార్సీపీ నేతలు మేడపాటి షర్మిలారెడ్డి, బొంతా శ్రీహరి, కోడికోట తదితరులు ఉన్నారు. -
బలవంతపు భూసేకరణను నిరసిస్తూ ఆందోళన
రైతుల పార్టీగా అఖిలపక్ష పోరాటం వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి నార్త్‌జోన్ డీఎస్పీ ప్రసన్నకుమార్‌తో చర్చలు సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నంలో బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాధిత రైతులతో కలిసి అఖిలపక్ష పోరాటం చేపడతామని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. బలవంతంగా భూములు తీసుకున్న రైతులతో కలిసి సీతానగరం బస్టాండ్ సెంటర్లో మంగళవారం ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా పోరాటం చేద్దామన్నారు. ఈ సందర్భంగా నార్త్‌జోన్ డీఎస్సీ ప్రసన్నకుమార్‌తో జక్కంపూడి చర్చించారు. రైతులకు పోలీసుల వేధింపులు లేకుండా చూడాలన్నారు. జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులతో సంప్రదించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం మధ్యాహ్న వరకూ మీరు రైతులకు అందించే న్యాయం కోసం చూస్తామని, గురువారం నుంచి రైతు కుటుంబాలతో కలిసి భూముల్లో ఉంటామని ఆమె స్పష్టం చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ రైతులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆమె డీఎస్పీకి సూచించారు. పై అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ బాధిత రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. భూములు తీసుకుంటున్నామంటూ మంగళవారం కూడా రెవెన్యూ అధికారులు రైతుల ఇళ్ల గోడలకు నోటీసులు అతికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్‌బాబు, వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంట్రాజు, బాధిత రైతులు ఐఎస్ఎన్ రాజు, గద్దె రామకృష్ణ, కలగర్ల భాస్కరరావు, కలగల సర్వారాయుడు, కరుటూరి విజయ్‌కుమార్ చౌదరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు మహా‘డప్పు’ సభ..
టీడీపి మహానాడుపై జక్కంపూడి రాజా విసుర్లు సీతానగరం (రాజానగరం) : విశాఖలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు.. బాబు మహాడప్పు సభగా మారిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అద్యక్షుడు జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఆదివారం నిర్వహించిన లంకూరు మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారం కోసం మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, మహానాడులో ఆయన ఫోటోకు భజన చేస్తున్నారన్నారు. టీడీపీ వారసత్వాన్ని నందమూరి వంశీయులకు కాకుండా లోకేష్‌కు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. లోకేష్‌కు దొడ్డిదారిన మంత్రి పదవి ఇచ్చి, పార్టీకి వారసత్వం ఇచ్చేందుకు తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టారని, ఆ తర్వాత 1999లో బీజేపీ పొత్తుతో గెలిచిన చంద్రబాబు.. తిరిగి 2014లో బీజేపీ పొత్తు, జనసేన సహకారంతో అధికారంలోకి వచ్చారన్నారు. పొత్తు లేకుండా ఎన్నికలలో చంద్రబాబు గెలిచిన సందర్బం లేదన్నారు. ఆడపడుచులకు పార్టీలో పెద్దపీట వేశామని డప్పు కొట్టుకునే టీడీపీలో మహిళలతో కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. టీడీపీ నాయకురాలు, సినీ నటి కవిత మహానాడులో జరిగిన అవమానంకు కంటతడి పెట్టారని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాల కొంప అని టీడీపీ ఎమ్మెల్సీ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీలోకి చేరేందుకు ఇతర పార్టీల ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని ఎన్టీఆర్ తొలి మహానాడులో తీర్మానం చేశారని, చంద్రబాబు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి డిపాజిట్ గల్లంతు అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ బాబు, వలవల రాజా, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతలు బరితెగించారు...
వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ(రాజానగరం) : ప్రభుత్వ అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు చెరువుల్లో మట్టిని తవ్వి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. సోమవారం కోరుకొండ మండలం పశ్చిమగానుగూడెం గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. కోరుకొండ మండలంలోని పలుగ్రామాల్లోని చెరువుల్లో పొక్లెయిన్లు పెట్టి మట్టిని తవ్వి లారీలు, ట్రాక్టర్లపై పోసి ఇటుకబట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నా ప్రభుత్వాధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువుల్లో మట్టిని తవ్వడమే కాకుండా, ప్రభుత్వానికి చెందిన కొండలను కూడా డొల్ల చేస్తున్నారని, కాలువల్లో ఉన్న ఇసుకను విక్రయిస్తున్నారన్నారు. ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ధనార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నాయకులు పనిచేస్తున్నారన్నారు. నీరు – చెట్టు పథకంలో అవినీతి చోటుచేసుకుంటోందన్నారు. ఇప్పటికైనా అధికారులు అధికార పార్టీ నేతలు అనధికారికంగా చేస్తున్న మట్టి, కంకర, ఇసుక తవ్వకాలను అరికట్టకపోతే వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తుందని జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. -
అవినీతికి చిరునామా ధవళేశ్వరం పంచాయతీ
కమర్షియల్ కాంప్లెక్స్‌లకు సాధారణ పన్నులు పేదప్రజలపై భారీగా పన్నుల మోత ఇంటి నిర్మాణ అనుమతుల్లోనూ భారీ అవకతవకలు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి ధవళేశ్వరం : ధవళేశ్వరం పంచాయతీ అవినీతికి చిరునామాగా మారిందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి బుధవారం ఆమె ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడి అవకతవకలపై కార్యదర్శి టి.శ్రీనివాసరావును నిలదీశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి డెత్ సర్టిఫికేట్ నుంచి ఇంటి పన్నుల వరకు ప్రతి దానిలోనూ అవినీతి పొంగిపొర్లుతోందని ఆరోపించారు. 48మంది పంచాయతీ కార్మికులను చూపిస్తున్నారని వీటిలోనూ భారీ అవకతవకలు జరిగాయన్నారు. లేనివారి పేరిట జీతాలు స్వాహా చేస్తున్నారని ఆమె విమర్శించారు. గ్రామంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆశ్రమాలు, అపార్ట్మెంట్లు, థియేటర్లు, కాలేజీలు, ఫ్యాక్టరీలకు సాధారణ పన్నులు వేసి ప్రజలపై భారాన్ని వేశారని జక్కంపూడి ఆరోపించారు. కమర్షియల్ పన్నులు పడాల్సిన చోట సాధారణ పన్నులు వేసేందుకు ఎవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారన్న వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఏడాదికి 500రూపాయలు కట్టే సామాన్య ప్రజలపై సుమారు 10రెట్లు భారం వేసి రూ.5వేలు వరకు పన్నులు పెంచేశారన్నారు. పంచాయతీ క్యాష్ బుక్‌లో ఫిబ్రవరి వరకే వివరాలు నమోదు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌కు ఇచ్చిన నకళ్లకు కార్యాలయంలో ఉన్న వాటికి సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ట్రాన్స్ఫర్లు లేనప్పటికీ ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. డెత్ సర్టిఫికేట్లకు సుమారు రూ.వెయ్యి వరకు గుంజుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి సొమ్మును ఇచ్చిన వారిని తీసుకువచ్చి చెప్పించారు. రూ.6వేలు కుళాయి పన్ను వసూలు చేస్తూ రూ.5వేలకు మాత్రమే రశీదు ఇస్తున్నారని ఆరోపించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్ కోసం వచ్చిన వారి వద్ద నుంచి కూడా భారీగా సొమ్మును గుంజుతున్నారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేనని చెప్పుకునే గోరంట్ల నియోజకవర్గంలోనే భారీ అవినీతి చోటు చేసుకుంటోందన్నారు. ఎన్నికలకు ముందు మూడు నెలల్లో రూరల్ గ్రామాలకు ఎన్నికలు జరిపిస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తోక్కారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని జక్కంపూడి విమర్శించారు. జన్మభూమి కమిటీల అవినీతితో వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ బిల్డింగ్ ప్లాన్లలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సుగుణానగర్లో 14శాతం కట్టించుకోవాల్సి ఉన్నప్పటికీ కట్టించుకోకుండా అనుమతులు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. ధవళేశ్వరం పంచాయతీలో చోటు చేసుకున్న భారీ అవినీతి అక్రమాలపై గురువారం కమిషనర్, సబ్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు, గోలి దేవకుమార్, షట్టర్ బాషా, దాసరి శివ, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, చంటి, ఏజీఆర్ నాయుడు, గునిపె అశోక్, పందిళ్ల భానుప్రసాద్, కేతా సాయి, పుట్టా పరేష్‌నాథ్, సత్యం వెంకటరమణ, బర్రి కామేశ్వరరావు, ప్రశాంత్‌కుమార్, మిరప రమేష్, ఏలీషా జగన్, కపూర్, యర్రంశెట్టి శ్రీరామ్, ఆకుల సూర్యప్రకాష్, తోలేటి రాజా, బలరామ్, మోహన్‌బాబు, పిల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే
టీడీపీ నేతల దాడులు సహించం జక్కంపూడి విజయలక్ష్మి ఉద్యమానికి అందరూ మద్దతు రెండేళ్లుగా నిలిపివేసిన భూముల రిజిస్ట్రేషన్లు వెంటనే చేయాలన్న డిమాండ్‌తో రైతులు, ప్రజలు సోమవారం కోరుకొండలో చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. బంద్, రాస్తారోకో, ప్రదర్శనతో కోరుకొండ అట్టుడికిపోయింది. వైఎస్సార్ సీపీతో పాటు అన్ని పార్టీలు టీడీపీ సహ ప్రజల ఆందోళనకు సంఘీభావం తెలిపాయి. మహోద్యమంగా మారుతున్నప్పటికీ ప్రజల డిమాండ్‌ను పరిష్కరించేందుకు పాలకులు ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారులకు సమస్య నివేదిస్తామని, అప్పటికీ వారు స్పందించకుంటే కోర్టునే ఆశ్రయిస్తామని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అల్టిమేటం ఇచ్చారు. కోరుకొండ (రాజానగరం) : రైతులు, ప్రజల భూములు రిజిస్ట్రేషన్లు వెంటనే చేయించకుంటే వారి పక్షాన ఏ త్యాగానికైనా సిద్ధమేనని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ఈ సమస్యపై సోమవారం నిర్వహించిన బంద్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 1,200 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు చేయించేలా ఇప్పటికైనా ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రయత్నించాలన్నారు. రైతుసేవా కమిటీ చేస్తున్న ఆందోళనకు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అన్నవరం దేవస్థానం, ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కలెక్టరు, సబ్ కలెక్టరు, దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతుంటే రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీలోని కొందరు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల నాయకులు బొరుసు బద్రి, అయిల శ్రీను, వాకా నరసింహరావు, తోరాటి శ్రీను, కోడినాగుల ప్రసాద్, పినమరెడ్డి సూర్యచంద్రం, పసుపులటి శివ, కాలచర్ల శివాజీ, కాలచర్ల నాగు, అయిల రామకృష్ణ, పసుపులేటి బుల్లియ్యనాయుడు, కోడూరి సత్తిరెడ్డి, వుల్లి గణనాథ్, అత్తిలి రాంప్రసాద్, సూరిశెట్టి అప్పలస్వామి, కోయిడాల అప్పల నరసింహరావు, కల్యాణం రాంబాబు, గణేషుల పోసియ్య, యడ్ల సత్యనారాయణ, కామిశెట్టి విష్ణు, సొంగా వెంకటేశ్వరరావు, జాజుల సత్తిబాబు, గింజాల వెంకట్రావు, పాలం నాగవిష్ణు, తోరాటి సత్యప్రసాద్, బెల్లం ప్రసాద్,అడపా జగదీష్, గొల్లవల్లి అప్పలనర్స, కాకి జగపతి, దాసరి యేసు, తదితరులు పాల్గొన్నారు. 13వ రోజుకు చేరిన రిలే దీక్షలు భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ కోరుకొండ, పశ్చిమగానుగూడెం, శ్రీరంగపట్నం, జంబూపట్నం, కాపవరం తదితర గ్రామాల రైతులు, ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 13వ రోజుకు చేరాయి. ఓలేటి సూర్యనారాయణమూర్తి, ముత్యాల శ్రీనివాస్, కోరిమిల్లి అరవాలరాజు, కర్రి మరికృష్ణ, పరిమి శివాజీ, కత్తుల శ్రీనివాసరావు, సూరిశెట్టి అవతారం, కొయిడాల సీతారాముడు, కోరిమిల్లి నాగరత్నం, మల్ల అప్పలనర్సమ్మ, సూరిశెట్టి సత్యవతి, దాడి రామాయమ్మ, దాడి సీతారామాయమ్మ, చరకణం పార్వతమ్మ, కాళ్ల అప్పలరాజు, అళ్ల పోషమ్మ, పెనకటి వేదవతి, సూరిశెట్టి తాతారావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. నేతల సంఘీభావం దీక్షా శిబిరాన్ని జక్కంపూడి విజయలక్ష్మి సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. 13 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఖండించారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ రైతులు ప్రజలు ఆందోళన పడవద్దని అందరికీ న్యాయం చేసేలా పాటుపడతానని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్ చైర్మ¯ŒS తనకాల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మతా సీతారాముడు, మల్ల అవతారం, తెలగంశెట్టి శ్రీనివాస్, పరస శ్రీను, కాళ్ల శ్రీరాములు, కోర్పు బుజ్జి, మైరెడ్డి రాంబాబు, మాతా ప్రభు, మాదబో యిన అప్పారావు, కొయ్యా శామ్యూల్, వాసిరెడ్డి సుబ్రహ్మణ్యం, కోర్పు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. జేపీ మండల అధ్యక్షుడు పసుపులేటి బాపిరాజు, పార్టీ నాయకులు గొట్టుముక్కల అన్నమాచార్యులు, తగరంపూడి గణపతి, లోక్‌సత్తా జిల్లా నాయకుడు కాళ్ళకూరి కృష్ణమోహన్, రాజానగరం నియోజక కన్వీనర్ నాగులపాటి బాలాజీ, మండల అధ్యక్షుడు నాగులపాటి సుబ్రహ్మణ్యం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాజానగం కన్వీనర్ కొత్తపల్లి భాస్కర రామం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు పి.ప్రదీప్, చొంగా సూర్యనారాయణమూర్తి, కె.భాస్కర్,. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పీఎస్ భార్గవ, కర్రి వీరగణేష్, గరగ శ్రీధర్‌బాబు తదితరులు సంఘీభావం తెలిపారు. కోరుకొండలో వివిధ కుల సంఘాలు, కార్మిక సం ఘాలు, ఆ«ధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు కూడా దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. -
‘ఎత్తిపోతల’ పేరుతో దోపిడీ
- వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా - కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందిన రైతులు అభినందనీయులు - ప్రభుత్వం కళ్ళు తెరవాలని హితవు సీతానగరం (రాజానగరం) : ఎత్తిపోతల పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో శుక్రవారం పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రభుత్వ పెద్దలు అందినకాడికి వేలాది కోట్లు దోచుకున్నారన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో తిరిగి దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందంటూనే మరోపక్క ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నారని, సీఎం జేబులు నింపుకోవడానికే ఈ పథకాలని ఆరోపించారు. పోలవరం పూర్తయితే ఎత్తిపోతల పథకాలు దేనికని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం పైపులైన్ మార్గంలో భూములు కోల్పొయే రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు భయాందోళనలకు గురి చేసి సంతకాలు చేయించారని విమర్శించారు. కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించి, న్యాయం పొందారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, తద్వారా రైతులు విజయం సాధించారని కొనియాడారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, ఆ చట్టం ప్రకారం వర్తించాల్సిన అంశాలను అమలు చేయాలని రాజా కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి వలవల రాజా, చళ్ళమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదతరులు పాల్గొన్నారు. -
అధికారుల తీరుపై జక్కంపూడి ధ్వజం
ఆలయ భూముల రికార్డులు తీసుకెళ్లడంపై ఆగ్రహం కోరుకొండ : శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి చెందిన వివిధ రకాల రికార్డులను అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకెళ్లడంపై రైతులు, ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. సోమవారం కోరుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. అన్నవరం దేవస్థానం ఈఓ, స్థానిక ప్రజాప్రతినిధి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్నేళ్లుగా కోరుకొండ దేవస్థానంలో ఉన్న రైతులు, ప్రజలకు సంబంధించిన భూముల రికార్డులు, స్వామి వారి ఆస్తుల రికార్డులను ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లడంపై మండిపడ్డారు. చివరకు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ. రంగరాజభట్టార్ స్వామికి కూడా సమాచారం తెలియకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. గోకవరం మండలం భూపతిపాలెంలో గల స్వామివారికి చెందిన 1180 ఎకరాల భూమి వివరాల పట్టాలన్నీ తీసుకెళ్లడం చూస్తుంటే దీని వెనుక ఏదో దాగి ఉందని విజయలక్ష్మి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకొండ, శ్రీరంగపట్నం, కాపవరం, జంబూపట్నం గ్రామాలకు చెందిన పలువురు రైతుల భూములు రిజిస్ట్రేషన్ కాకుండా అన్నవరం దేవస్థానం వారు నిలుపుదల చేయడంపై గతంలో ఆందోళన చేయడం, అన్నవరం ఈఓకు వినతిపత్రం అందించామన్నారు. రెండున్నరేళ్లుగా రైతులు, ప్రజలకు చెందిన భూములను రిజిస్ట్రేషన్లు నిలిపివేయడానికి ఎలాంటి ఆధారం ఉందో తమకు వివరించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన భూములు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి చెందినవా, రైతులవా అని తెలియకుండా అన్నవరం దేవస్థానం అధికారులు ఏ హక్కుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఆరోపించారు. వెంటనే అన్నవరం అధికారులు రికార్డులను కోరుకొండకు తీసుకు రాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు నక్కా రాంబాబు, గరగ మధు, తాడి హరిశ్చంద్ర ప్రసాద్‌రెడ్డి, వాకా నరసింహారావు, నీరుకొండ యుదిష్టర నాగేశ్వరరావు, అయిల శ్రీను, తిక్కిరెడ్డి హరిబాబు, దాసరి యేసు, గుగ్గిలం భాను తదితరులు ఉన్నారు. -
అసెంబ్లీ దృష్టికి నర్సరీ మీటర్ల సమస్య
వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కడియం (రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల దృష్టికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా నర్సరీలకు విద్యుత్ మీటర్ల అంశాన్ని తీసుకువెళ్లనున్నట్టు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. కడియం మండలం మాజీ జెడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రయ్య చేతికి గాయం కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరవరంలోని దొంతంశెట్టి స్వగృహంలో బుధవారం ఆయన్ను పరామర్శించిన అనంతరం స్థానిక విలేకరులతో జక్కంపూడి రాజా మాట్లాడారు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్లలో సైతం డబ్బులు దండుకుంటున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు నర్సరీ రైతులు ఇబ్బందులు కన్పించడం లేదన్నారు. నర్సరీ రైతుల సమస్యను జగన్ ద్వారా అసెంబ్లీలో ప్రస్తావింపజేస్తామని జక్కంపూడి తెలిపారు. అంతే కాకుండా సమస్య పరిష్కారానికి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వెల్లడించారు. రాజా వెంట మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి ఉన్నారు. -
నర్సరీ రైతులను మోసగిస్తున్న ఎమ్మెల్యే బుచ్చయ్య
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కడియం (రాజమండ్రి రూరల్) : కడియం ప్రాంత నర్సరీ రైతులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. పార్టీ రూరల్ కోఆరి్డనేటర్ ఆకుల వీర్రాజు, పలువురు నర్సరీ రైతులతో కలిసి మండలంలోని బుర్రిలంకలోగల తాడాల చక్రవర్తి నర్సరీలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వందలాది మంది రైతులు తమ సమస్యను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఇంటికి వెళితే డీఈ స్థాయి అధికారితో మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యుత్‌శాఖ మంత్రితోనో, సీఎండీతోనో మాట్లాడితే రైతుల సమస్యను వారి దృష్టిలో పెట్టినట్లైనా ఉంటుందని, కానీ డీఈ స్థాయి అధికారితో మాట్లాడి రైతుల సమస్యను ఏ విధంగా పరిష్కరిద్దామనుకుంటున్నారని? ప్రశ్నించారు. అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు వినతి మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి ఇచ్చిన మినహాయింపును ఇప్పటి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందో? సమాధానం చెప్పాలన్నారు. కడియం ప్రాంత నర్సరీ రైతులపై కరెంటు బండను మోపడం వెనుకున్న ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. గతంలో కూడా మీటర్లు పెట్టే ప్రయత్నం చేసినందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇంటికెళ్లిపోయిందని గుర్తు చేశారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా జక్కంపూడి రామ్మోహనరావు కరెంటు మీటర్లకు వ్యతిరేకంగా ఒక్కడే పోరాడారన్నారు. రామ్మోహనరావు కంటే బాగా చేస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న గోరంట్ల ఇక్కడి నర్సరీ రైతులకు ఇచ్చే బహుమానం ఇదేనా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో సహా టీడీపీ ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి పోరాటానికి దిగితే రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం ఎందుకివ్వదన్నారు. పలు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్లో సైతం నర్సరీలను వ్యవసాయ కేటగిరీలుగానే భావించి, మినహాయింపులు ఇవ్వాలని తీర్పునిచ్చాయని గుర్తు చేశారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యాదల సతీష్‌చంద్రస్టాలిన్, జిల్లా సహాయ కార్యదర్శి తాడాల విష్ణుచక్రవర్తి, మాజీ ఎంపీటీసీ బుడ్డిగ వీరవెంకట్రావుగౌడ్, పార్టీ జిల్లా కార్యదర్శులు సంగిత వేంకటేశ్వరరావు, కొత్తపల్లి రాము, కడియం మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి పాల్గొన్నారు. -
భయాందోళనలో చంద్రబాబు
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ప్రయత్నం అర్థం లేని నిర్ణయాలతో పేదలకు రేషన్ అందకుండా చేస్తున్నారు సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీతానగరం (రాజానగరం): ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర భయాందోళనలో ఉన్నారని, అందుకే అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేందుకు పూనుకుంటున్నారని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసి ఏడాది పూర్తి కావొస్తోందన్నారు. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. రేషన్ షాపుల్లో క్యాష్‌లెస్ విధానం అంటు లబ్ధిదారులకు సరుకులు అందించకుండా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలు ప్రవేశపెట్టింది రేషన్ సరుకులు నిలిపివేయడానికేనని ఆరోపించారు. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను వైఎస్సార్ సీసీ బయట పెట్టడంతో, తమను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రజల దృష్టిలో దోషులుగా నిలిచారని చెప్పారు. బస్సు ప్రమాదంలో జేసీ బ్రదర్స్‌ను కాపాడేందుకు చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తమ పార్టీ నాయకుల్ని కాపాడుకునేందుకు చూస్తున్నారే తప్ప ప్రజా సేవను పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. ఇసుక, మట్టి వ్యాపారం చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ దందా వంటి పలు అక్రమాలకు పాల్పడడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టి, పాలన పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనేఉన్నాయన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్ బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్ళమళ్ళ సుజీరాజు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు -
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి కాకినాడ రూరల్ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు రంగవల్లులు దర్పణాలుగా నిలుస్తాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. బుధవారం రాత్రి రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెం, కొత్తూరులలో పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి లింగం రవి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పాలగుమ్మి నాగరాణిల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. పండగల్లో సంస్కృతితో పాటు భక్తి, సేవాగుణం, అనుబంధాలు, ఆటపాటలు, ఉల్లాసం, ఉత్సాహం సమ్మిళితమై ఉంటాయన్నారు. భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రవి, నాగరాణిలు సంక్రాతి ఉత్సవాలను తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా గ్రామాల్లో చేపట్టడం అభినందనీయమన్నారు. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాయుడుపాలెంలో వినూత్న పద్ధతిలో ఇంటింటా సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటి వద్దా రంగవల్లులు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు తమ ఇళ్ల వద్ద రంగురంగుల ముగ్గులు వేసి గ్రామ ఐక్యతను చాటారు. వారిలో ఐదుగురిని విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. మరో 9 మందికి కన్సొలేష¯ŒS బహుమతులు, 10 మందికి లక్కీడిప్ ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మరో 11 మందికి మొత్తం 36 మందికి బహుమతులు అందజేశారు. కూచిపూడి, భరతనాట్యం, చిన్నారులతో సాంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహించారు. గ్రామస్తుల కోరికపై జక్కంపూడి విజయలక్ష్మి లింగం రవిని దుశ్శాలువాతో సత్కరించారు. పెద్దాపురం స్పెషల్ కోర్టు జడ్జి సూరిబాబు, ఫుడ్ కార్పొరేష¯ŒS ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్సలే్టటివ్ కమిటీ సభ్యుడు అబ్బిరెడ్డి ప్రభాకరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చెల్లే శేషారావు, విత్తనాల రమణ, పెంకే వీరబాబు, కొత్తపల్లి గిరీష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి డీకే వరప్రసాద్, మహిళా నాయకులు పల్లా కాత్యాయని, వెంట్రు స్వర్ణలత, ముదిలి శ్రీదేవి, మాలతి, రజని తదితరులు పాల్గొన్నారు. -
జనం పాట్లు పట్టని ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి బ్యాంక్ అధికారుల దృష్టికి పింఛన్‌దారుల పాట్లు కోరుకొండ : పెద్దనోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలతో పాటు పింఛన్‌దారులైన దివ్యాంగులు, వితంతువులు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బ్యాంకుల వద్ద నిత్యం నరకయాతన పడుతున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పింఛన్‌దారులు పడుతున్న సమస్యలను సోమవారం ఆమె తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ స్టేట్ బ్యాంకు మేనేజరు ద్వారంపూడి వెంకటకృష్ణారెడ్డి, పశ్చిమ గానుగూడెం ఆంధ్రా బ్యాంకు మేనేజరు పీఎస్ రాజాలకు వివరించారు. నడవలేని స్థితిలో ఉన్న కోటికేశవరానికి చెందిన గుడేలి కాంతమ్మ (బధిర వృద్ధురాలు), బొల్లెద్దుపాలెంకు చెందిన వికలాంగురాలు గోలి గన్నెమ్మలను వారి వద్దకు తీసుకెళ్లి వారి వెతలను వినిపించారు. పింఛన్‌దారులతో పాటు రైతులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు నగదు కోసం చాలా అవస్థలు పడుతున్నారన్నారు. ఏటీఎంలలో కూడ నగదు ఉండడం లేదని ఆరోపించారు. పింఛన్దారులలో కొందరు ఏటీఎం కార్డులు, బ్యాంకు అకౌంట్ల కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. పింఛన్‌దారులందరికీ నేరుగా పంచాయతీల ద్వారా నగదు బట్వాడా చేయాలని డిమాండ్ చేశారు. పోస్టాఫీసులలో చాలా రోజులుగా నగదు ఇవ్వడం లేదని ఆరోపించారు. పింఛన్‌దారులు, బ్యాంకు వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, జిల్లా కార్యదర్శులు చింతపల్లి చంద్రం, అయిల శ్రీను, మండల బీసీ సెల్ కన్వీనర్ సూరిశెట్టి భద్రం, రాష్ట్ర యూత్ కార్యదర్శి బొరుసు బద్రి, మండల యూత్ అధ్యక్షుడు అడపా శ్రీను, మండల అధికార ప్రతినిధులు గరగ మధు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, కోరుకొండ యూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి సత్తిరెడ్డి, పసుపులేటి బుల్లియ్యనాయుడు, విద్యార్థి విభాగం నాయకుడు వుల్లి గణనాథ్, ఎంపీటీసీ వుల్లి చెల్లారావు, రైతు నాయకులు గింజాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ కష్టాలు తీర్చాలి. కరెన్సీ కష్టాలను తక్షణం తీర్చాలని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద తగినంత నగదు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం కోరుకొండలో ప్రదర్శన నిర్వహించారు. పింఛనుదార్లకు ఆయా పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్లు అందించాలని; రైతులు, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగదు ఇవ్వాలని; వృద్ధులు, వికలాంగులకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
స్వరాజ్య మైదానం ప్రైవేట్‌కు
►పీపీపీ విధానంలో సిటీ స్క్వేర్ ప్రాజెక్టుకు అనుమతి ►స్మార్ట్ సిటీలుగా ఆరు నగరాలు ►జక్కంపూడిలో ఎకనామిక్ సిటీ ►విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ►రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో సిటీ స్క్వేర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందులో ఉన్న రైతు బజార్, ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లను తొలగించి మిగిలిన గ్రౌండ్‌తో కలిపి పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో మల్టీ పర్పస్ రిక్రియేషన్ అండ్ కమర్షియల్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే చైనాకు చెందిన జీఐఐసీ కంపెనీతో ఈ సిటీ స్క్వేర్ డిజైన్ తయారు చేయించిన ప్రభుత్వం దాన్ని ఆమోదించనుంది. దీనికి సంబంధించిన డీపీఆర్ (సవివర నివేదిక)ను ఆమోదించే బాధ్యతను పట్టణీకరణపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీపీపీ విధానంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతోపాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, నారాయణ మీడియాకు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి... ♦ విజయవాడ స్వరాజ్య మైదానం, దానికి ఆనుకుని ఉన్న 27.5 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో విజయవాడ సిటీ స్క్వేర్ ఏర్పాటుకు అనుమతి. అందులో షాపింగ్ కాంప్లెక్స్, థీమ్ పార్క్, ఎగ్జిబిషన్ కాంప్లెక్స్, మినీ ఇండోర్ స్టేడియం, పబ్లిక్ ప్లేస్ తదితరాలు ఏర్పాటు. ♦ విశాఖపట్నంలో 11 ఎకరాల్లో పీపీపీ విధానంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం. ♦ విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో మౌలిక వసతుల ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు గుంటూరు–విజయవాడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) ఏర్పాటుకు ఆమోదం. ♦ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు స్మార్ట్ సిటీలు కాకుండా కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం. ♦ విజయవాడలోని జక్కంపూడిలో 256 ఎకరాల్లో పీపీపీ విధానంలో ఎకానమిక్ టౌన్షిప్ ఏర్పాటుకు అనుమతి. ♦ మున్సిపల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సర్వీసు నిబంధలను క్రమబద్ధీకరించేందుకు ఆమోదం. ♦ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 35 శాతం వేతనాల పెంపునకు ఆమోదం. ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా మరో పది శాతం ప్రోత్సాహకం అదనంగా చెల్లింపు. భారీగా భూకేటాయింపులు ♦ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం సర్వే నెంబర్ 1604లోని 9.74 ఎకరాలను ఎకరం రూ.8 లక్షల చొప్పున ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయింపు. ♦ అగ్రిగోల్డ్‌కు సంబంధించి విజయవాడలో రూ.90 కోట్ల విలువైన 13 ఆస్తులు, కృష్ణాజిల్లా కీసరలో రూ.200 కోట్ల విలువైన 341 ఎకరాల వేలానికి 26వ తేదీ వరకూ బిడ్ల స్వీకరణ. 27వ తేదీన బిడ్లు తెరవాలని నిర్ణయం. బ్యాంకులపై నెట్టేయండి... పెద్ద నోట్ల రద్దు అంశం మంత్రివర్గ , తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇప్పటివరకూ పెద్ద నోట్ల రద్దుకు కర్త, కర్మ, క్రియ తానేనని చెప్తూ వచ్చిన సీఎం చంద్రబాబు ఇక నుంచి ఆ అంశంపై సాధ్యమైనంత తక్కువగా మాట్లాడటంతో పాటు ప్రస్తావించకూడదని నిర్ణయించారు. గురువారం బాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బాబు నోట్ల రద్దు పరిణామాల తప్పిదాన్ని బ్యాంకులపై నెట్టేయాలని సూచించారు. ♦ కేబినెట్ భేటీకి సెల్ఫోన్లు తీసుకురావొద్దు సీఎంవో కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనే మంత్రులు తమ సెల్ఫోన్లను బయటే డిపాజిట్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మరో రెండు ఫ్లోర్లకు పెంచండి
జక్కంపూడి కాలనీ (విజయవాడ రూరల్) : విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి హౌసింగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను మరో రెండు ఫ్లోర్లకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రూ.2 కోట్ల 20 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధునాతన బిల్డింగ్‌ను ఈ కాలనీలో నిర్మించడం êగుందని, దీనిని మరో రెండు ఫ్లోర్లకు పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదనంగా నిర్మించే రెండు ఫ్లోర్లలో కాలనీలోని మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, అద్దకం సంబంధిత శిక్షణను ఇప్పించాలని సూచించారు. అద్దెపై వచ్చే ఆదాయంతో కమ్యూనిటీహాల్ నిర్వహణ చేపట్టాలన్నారు. భూకంపాల తాకిడిని తట్టుకొనేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమ్యూనిటీహాల్ నిర్మించామని ముఖ్యమంత్రికి ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. అక్కడ కుట్టుమిషన్ శిక్షణతో ఉపాధి పొందుతున్న మహిళలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం ఆధునిక వసతులతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్, గొల్లపూడి సర్పంచ్ సాధనాల వెంకటేశ్వరమ్మ, జక్కంపూడి సర్పంచ్ కొమ్ము రవి, ఎంపీపీ వడ్లమూడి జగన్మోహనరావు, జిల్లా కలెక్టర్ బాబుఏ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, సబ్ కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. ఎరుకల కులస్తులను గుర్తించండి విజయవాడ (రామవరప్పాడు) : ఎరుకల కులస్తులను ప్రభుత్వం గుర్తించి వారి అభ్యున్నతికి సహకరించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ కోరారు. నగరంలోని సీఎం క్యాంప్ కార్యాలయం లో బుధవారం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్‌కుమార్, మానుపాటి నవీన్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఎరుకల కులస్తుల జీవనాధారమైన పందుల పెంపకానికి ప్రభుత్వం సహకరించి పిగ్గరీస్ బోర్డు ఏర్పాటు చేయాలని, గిరిజనులకు నామినేటెడ్ పదవులు ఇప్పించాలని కోరామన్నారు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఉమ్మడి రాష్ట్రాల ట్రెజరర్ కుంభ ఉదయ్ కుమార్ ఏకలవ్వ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన కొత్తపేట : రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కొత్తపేట వచ్చిన ఆమె స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి పార్టీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. మహిళా అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, విద్యార్థులను వేధించడం, పేదల పింఛన్లు, రేష¯ŒS రద్దు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ధనాన్ని తన అనుయాయులకు, పార్టీ పెద్దలకు ఎలా మళ్లించాలన్న ధ్యాసే తప్ప రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. రెండున్న సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది జగ¯ŒSమోహనరెడ్డి ఒక్కరేనన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారన్నారు. కాపు కార్పొరేష¯ŒSతో చేతులు దులపుకున్నారు కాపులను బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చిన పాలకులు నిధులు లేని కార్పొరేష¯ŒS ఏర్పాటు చేసి చేతులు దులపుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని శాంతియుతంగా పోరాడుతుంటే సెక్ష¯ŒS 30,144 అమలు, గృహ నిర్బంధం చేస్తున్నారని అన్నారు. వారు మాత్రం జనచైతన్య యాత్రలు పేరుతో ప్రజల సమస్యలు పరిష్కరించకుండా విహార యాత్ర లు చేస్తున్నారని దుయ్యపట్టారు. రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్?ర నాగిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సేవాదళ్ కార్యవర్గ సభ్యుడు చల్లా ప్రభాకరరావు, జిల్లా పార్టీ కార్యదర్శి రెడ్డి చంటి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రదాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
జనయోధుడికి ఘన నివాళి
జిల్లావ్యాప్తంగా జక్కంపూడి వర్ధంతి విస్తృతంగా సేవా కార్యక్రమాలు సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ఐదో వర్ధంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి జక్కంపూడి నిరంతర పోరాటం చేశారని, తుది శ్వాస వరకూ పేదల కోసమే పని చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొనియాడారు. జక్కంపూడి అనుచరుడు నరవ గోపాలకృష్ణ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ‘జక్కంపూడి ప్రజా వారధి’ స్వచ్ఛంద సేవా సంస్థను, సంస్థ వ్యా¯Œæను అంబటి ప్రారంభించారు. కంబాలచెరువు సెంటర్లో ఉన్న జక్కంపూడి విగ్రహానికి ఆయన, సినీ నటుడు సుమన్, పార్టీ సిటీ, రూరల్ కో ఆర్డినేటర్లు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, జక్కంపూడి తనయుడు జక్కంపూడి రాజాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి అంబటి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వెఎస్ రాజశేఖరరెడ్డికి అంత్యంత సన్నిహితుడుగా రామ్మోహనరావు నిలిచారని అన్నారు. వైఎస్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పడు అనారోగ్యానికి గురైతే వెన్నంటే ఉన్నారని గుర్తు చేశారు. జక్కంపూడి అనారోగ్యానికి గురైనా మంత్రివర్గంలో వైఎస్ కొనసాగించారని, ఇది వారి స్నేహాన్ని స్పష్టం చేస్తుం దన్నారు. వైఎస్ కుటుంబానికి జక్కంపూడి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తని అన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, తనను నమ్ముకున్న వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉండే గొప్ప వ్యక్తి జక్కంపూడి అని అన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి పోరాట పటిమే స్ఫూర్తిగా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. నమ్మకానికి మారుపేరు జక్కంపూడని ఆకుల వీర్రాజు కొనియాడారు. పార్టీ నేతలు మిండగుదిటి మోహన్, రావూరి వెంకటేశ్వరరావు, మేడపాటి షర్మిలారెడ్డి, మింది నాగేంద్ర, సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, దంగేటి వీరబాబు, ఆర్వీవీ సత్యనారాయణ, జక్కంపూడి గణేష్, గుర్రం గౌతం పాల్గొన్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు వైఎస్సార్ సీపీ కడియం మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి ఏర్పాటు చేసిన వైద్య, రక్తదాన శిబిరాలను అంబటి రాంబాబు, సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. రాజానగరంలో వృద్ధులకు అంబటి దుప్పట్లు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యాన జక్కంపూడి వర్ధంతి నిర్వహించారు. మలికిపురంలో జక్కంపూడి చిత్రపటానికి వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ ఆధ్వర్యాన అమలాపురం ఎన్టీఆర్ మార్‌్గలో జక్కంపూడి రామ్మోహనరావు వర్థంతి సభ నిర్వహించారు. -
అభివృద్ధికి ప్రతిపాదనలు
విజయవాడ : జక్కంపూడి కాలనీలో కేటాయించిన ప్లాట్లలో అభివృద్ధి పనులకు అదనంగా రూ.7కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా, భవిష్యత్తులో నిర్వహణ బాధ్యతలను చేపట్టే దిశలో భాగంగా జక్కంపూడి కాలనీని వీఎంసీకు అప్పగిస్తామన్నారు. స్థానిక జక్కంపూడి ప్రాంతంలో మంగళవారం 157 నుంచి 184 వరకు గల సర్వేనెంబర్లలో భూములను, అక్కడ నిర్మించిన రోడ్లను, ఇతర పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని బృందం కాలనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జక్కంపూడి పరిధి భూములలో కేటాయించిన ఇళ్ల స్థలాల అభివృద్ధి కోసం ప్రభుత్వం గతంలలో రూ.25 కోట్లు మంజూరు చేసిందని, రూ. 21.61కోట్లతో వివిధ పనులను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టామన్నారు. కార్పొరేషన్ వద్ద ఉన్న రూ. 3.39కోట్లకు అదనంగా మరో రూ. 7కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ జక్కంపూడి ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసిన సర్వే నెంబర్లలో 157,161 నుంచి 170 (162 సర్వేనెంబరు మినహా) 175 నుంచి 181, 182పి, 183, 184 నెంబర్లలో భూములకు రిజిస్ట్రేషన్లను అనుమతులు ఇచ్చామని స»Œ కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. జక్కంపూడి రైతులకు సంబంధించి 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ,711 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు తొలగాయని ఆమె తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, ఎంఎంసీ చైర్మన్ జె.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జక్కంపూడిలో రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ
– 175 టు 184 సర్వే నెంబర్ల వరకు ఓకే – 157, 161–170పై ఆంక్షలే – కీలక సమీక్షలో కలెక్టరు బాబు వెల్లడి విజయవాడ: జక్కంపూడి ప్రాంతంలో నిలుపుదల చేసిన స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్దరించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబు.ఏ తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో సెక్షన్ – 22పై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వాస్తవ యజమానులకు ఎటువంటి సమస్యా లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా జక్కంపూడి పరిధిలో 157, 161 నుంచి 170 (162 సర్వే నంబరు మినహా) 175 నుంచి 181, 182పి, 183, 184 సర్వే నంబర్లలో భూములను రిజిస్ట్రేషన్లను చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నగరపరిధిలో 655 ఎకరాల్లో... విజయవాడ నగర పరిధిలో 655 ఎకరాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతామని కలెక్టరు తెలిపారు. నగరంలో విఎంసీ, సీఆర్డిఏ తదితర శాఖలకు చెందిన సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లకు యోగ్యమైన వాటికి అనుమతులు ఇచ్చేస్తామన్నారు. మిగిలిన పెండింగులో ఉన్న సర్వే నంబర్లలో భూములను కూడా సర్వే జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపైన, భూముల కేటాయింపుల పైన చర్యలపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జక్కంపూడి ఫార్మర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సూచించిన పలు అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అక్టోబర్ 4వ తేదీన జక్కంపూడి ప్రాంతంలో అధికార బృందంతో పర్యటిస్తానని కలెక్టర్ చెప్పారు. జక్కంపూడి పరిధిలో 711 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు తొలిగాయని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ గంధం చంద్రుడు, సబ్–కలెక్టర్లు జి. సృ జన, లక్ష్మీశా, రిజిస్ట్రేషన్ అధికారులు జి. బాలకృష్ణ, శ్రీనివాసరావు, శివరాం, తహశీల్దార్లు ఆర్. శివరావు, మదన్మోహన్లు పాల్గొన్నారు. -
ప్రమాణాలొద్దు.. విచారణకు సిద్ధం కండి
ఎమ్మెల్యే పెందుర్తికి జక్కంపూడి ప్రతి సవాల్ ఫరిజల్లిపేట (రాజానగరం) : అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు గుడిలో ప్రమాణాలు కాదు, ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు ప్రతి సవాల్ చేశారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే పెందుర్తి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి, ఇసుక మాఫియాను ఏనాడు ప్రోత్సహించలేదని, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తన తల్లిపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, మీరూ సిద్ధమా? అంటూ సవాల్ చేయడంపై రాజా ప్రతిస్పందించారు. ప్రమాణాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని, చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను కోరాలని డిమాండ్ చేశారు. అందుకు గవర్నర్‌ను, సీఎంను కలిసేందుకు తాను కూడా వస్తానని చెప్పారు. ముగ్గళ్ల, కాటవరం, వంగలపూడి, సింగవరం ర్యాంపుల్లో ఎక్కడెక్కడ, ఎవరి వద్ద ఎంత తీసుకున్నారనేది ప్రజలందరికీ తెలుసని రాజా పేర్కొన్నారు. కాటవరం ర్యాంపులో శనివారం రాత్రి రూ.10 లక్షలు తీసుకుని, కార్యకర్తలకు ఆదివారం భోజనాలు పెట్టిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమారు రూ.ఆరు కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా జాలిముడి వద్ద దుర్గ అనే పేద మహిళ మరణిస్తే, ఇంతవరకు ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదని చెప్పారు. చెవిలో పువ్వు, ముక్కున వేలుతో నిరసన సీఎం చంద్రబాబు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ రాజాతో పాటు పార్టీ నేతలు చెవిలో పూలు పెట్టుకుని, ముక్కున వేలు పెట్టి ఫరిజల్లిపేటలో నిరసన ప్రదర్శన చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వెంకటేష్ తగిన సమాధానం చెప్పలేక, నల్లబ్యాడ్జీలతో నిరసన అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాగే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా, న్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉండమట్ల రాజబాబు, పార్టీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు పేపకాయల విష్ణుమూర్తి, అనదాస సాయిరామ్, అడబాల చినబాబు, నాతిపాము సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకే స్టే ఈదరాడ (మామిడికుదురు) : ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో రాజా మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఓటుకు నోటు కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. దోపిడీ, బరితెగింపు ధోరణిలో టీడీపీ ప్రభుత్వ విధానం ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన అని, అదే బాటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని రాజోలు కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లి డేవిడ్, తోరం సూర్యభాస్కర్, జక్కంపూడి వాసు, రావి ఆంజనేయులు, విస్సా నాగేశ్వరరావు, అడబాల బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
బండి వెనుక బండి..!
చిట్టినగర్ : జక్కంపూడి వైవీ రావు ఎస్టేట్ నుంచి పైపులరోడ్డు జంక్షన్ ఉడా నిర్మించిన ఇన్నర్ రోడ్డులో ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పుష్కర స్నానాలకు విచ్చేసే యాత్రికుల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఇన్నర్ రోడ్డులో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గంట పాటు వాహనాలు ఒక దాని వెంట మరొకటి నిలిపిపోయాయి. నైనవరం ఫ్లై ఓవర్ మీదగా వాహనాలను అనుమతించకపోవడమే ట్రాఫిక్‌జామ్‌కు కారణంగా తెలుస్తోంది. మరో వైపున వైవీ రావు ఎస్టేట్ సమీపంలోని పుష్కర్‌నగర్ నుంచి నడుపుతున్న ఉచిత బస్సులను సైతం ఫ్లై ఓవర్ మీదకు అనుమతించలేదు. దీంతో పలుమార్లు ఆర్టీసీ, పోలీసు సిబ్బందికి వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. -
ఇసుక గోతులతో ఉసురు తీస్తారా?
సీతానగరం: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలతో జేబులు నింపుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి (సీజీసీ) సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. సీతానగరంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నీరు లేనపుడు కృష్ణా నదిలో టీడీపీ నేతలు గుంటలు చేసి ఇసుక అమ్ముకుని, పుష్కరాల్లో అవే గుంటల్లో పడి ఐదుగురు విద్యార్థుల మరణానికి కారణమయ్యారని విమర్శించారు. గత కృష్ణా పుష్కరాల్లో ఇద్దరు చనిపోతే నాటి సీఎం వైఎస్ రాజీనామాకు డిమాండ్ చేసిన టీడీపీ నేతలు గోదావరి పుష్కరాల్లో 29 మంది, కృష్ణా పుష్కరాల్లో ఐదుగురి మరణాలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. పుష్కరాల మరణాలకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, ఆయన కృష్ణా జిల్లా ప్రతినిధి దేవినేని ఉమామహేశ్వరావు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరపున ఉద్యమిస్తాం ఖరీఫ్‌కు సాగునీరు అందించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయలక్ష్మి అన్నారు. అవసరమైతే తాము రైతుల తరఫున ఉద్యమిస్తామని చెప్పారు. కలవచర్ల పుష్కర లిఫ్ట్ ద్వారా సీతారాంపురం, మురారి, సింగరాయపాలెం, గాదరాడలలోని 4,500 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా, ఇప్పటి కేవలం 25 ఎకరాల్లో మాత్రమే ఊడ్పులయ్యాయన్నారు. గతంలో వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించే పరిస్థితులు కల్పించారన్నారు. అధికార పార్టీ ధన దాహం వల్లే :పాపారాయుడు మండపేట : అధికారపార్టీ నేతల ధన దాహం వల్లే కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు అన్నారు. కృష్ణానది పాయలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి ఐదుగురు విద్యార్థులు మృత్యువాత పడానికి టీడీపీ నేతలు బాధ్యత వహించాలని ఆయనన్నారు. స్థానిక కామత్ ఆర్కేడ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతోందని విమర్శించారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారం అధికార పార్టీ నేతలు తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. పెద్దపెద్ద గోతులు ఏర్పడుతుండండగా నీళ్లు వచ్చిన తర్వాత అవి కానరాక అమాయక ప్రజలు, మూగజీవాలు వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
జనయోధుడు జక్కంపూడి
జయంతి సందర్భంగా పలువురి నివాళి l జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు సాక్షి, రాజమహేంద్రవరం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సమకాలికునిగా ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన జనయోధుడు జక్కంపూడి రామ్మోహనరావు అని పలువురు నేతలు కొనియాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హైదరాబాద్‌లోని జగన్ స్వగృహంలో జక్కంపూడి 63వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు, ప్రజలకు వెన్నుదన్నుగా అనేక పోరాటాలు చేసిన జక్కంపూడి సేవలు అజరామరమని నేతలు కొనియాడారు. జక్కంపూడి జయంతిని శనివారం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, జక్కంపూడి అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాజానగరం వృద్ధాశ్రమంలో అన్నసమారాధన నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు జక్కంపూడి జయంతి వేడుకలు నిర్వహించారు. కోరుకొండ, పి.గన్నవరం, మామిడికుదురు, మండపేట, రాజమహేంద్రవరం మండలం తొర్రేడు, కడియం మండలం బుర్రిలంకలో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అమలాపురం నల్ల వంతెన చేరువలోని జక్కంపూడి విగ్రహం వద్ద పార్టీ నేతలు, శ్రేణులు జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లాలో పలుచోట్ల అన్నసమారాధన, రక్తదానం, వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు. ఉద్యమాలే ఊపిరిగా కార్యకర్తల కోసం సైనికుడిలా జీవిత చరమాంకం వరకు పాటుపడిన జక్కంపూడిని నేటి తరం రాజకీయ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు సెంటర్లో జక్కంపూడి నిలువెత్తు విగ్రహానికి ముద్రగడ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్ధి కోసం జక్కంపూడి అహర్నిశలు కష్టపడ్డ యోధుడని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా, పార్టీ నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు భారీ కేకును కట్ చేశారు. వైద్య శిబిరంలో 2 వేల మందికి పైగా సేవలు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో సీతానగరం చినకొండేపూడి సూర్యచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం, రక్తదానం శిబిరం నిర్వహించారు. వైద్యశిబిరంలో పలు విభాగాలలో 40 మంది వైద్యనిపుణులు రెండువేల మందికి పైగా సేవలందించారు. రక్త పరీక్షలు, ఈజీసీ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందించారు. కాగా వందోసారి రక్తదానం చేసిన సీతానగరం మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు డాక్టర్ బాబును పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, విజయలక్ష్మి, రాజా అభినందించారు. కన్నబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జక్కంపూడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి, కేక్ కట్ చేశారు. జక్కంపూడి అందించిన స్ఫూర్తితో నడుచుకోవాలన్నారు. సామాన్య కార్యకర్తగా ఉంటూ జిల్లా రాజకీయాలను శాసించిన గొప్పనాయకుడన్నారు. -
మా కొంపలు కూల్చొద్దు
మంత్రి వద్ద గోడు వెల్లబోసుకున్న మహిళలు విజయవాడ సెంట్రల్/ పూర్ణానందంపేట : ‘మా కొంపలు కూల్చి రోడ్డున పడేయొద్దయ్యా’ అంటూ పాతరాజ రాజేశ్వరిపేట మహిళలకు మంత్రి పి.నారాయణ వద్ద వాపోయారు. కార్పొరేటర్ అల్లు జయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రిని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ నెలాఖరు లోపు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా రైల్వే అధికారులు 1,700 మందికి నోటీసులు జారీ చేశారని షేక్ ఖుర్షీదా, వైజయంతిమాల తదితరులు మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. 40 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నామన్నారు. ఆస్థలం తమదంటూ నోటీసులు జారీ చేసిన రైల్వే అధికారులు ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారని వివరించారు. ఈ సమస్యను ఎంపీ కేశినేని నాని దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. జక్కంపూడిలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పంపిణీ పూర్తయిపోయిందని, ఇప్పుడు తాము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేస్తే రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే అధికారులతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
ఇళ్లు ఇప్పిస్తామని పరారీ
బాధితుల ఆందోళన సత్యనారాయణపురం : జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి పేదల నుంచి భారీగా డబ్బులు దండుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి ఇల్లు ఇప్పిస్తానని చెప్పి లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసి పరారయ్యాడు. తాడేపల్లికి చెందిన షేక్ జిలాని జక్కంపూడిలో నిర్మించిన ఇళ్లు ఇప్పిస్తానని సుమారు వంద మంది వద్ద నగదు వసూలు చేసినట్లు తెలిసింది. ఆరు నెలలుగా అతను తప్పించుకొని తిరుగుతూ తాడేపల్లి నుంచి గుడివాడకు మకాం మార్చాడు. ఈనేపధ్యంలో గురువారం రాత్రి సుమారు 15 మంది బాధితులు సత్యనారాయణపురం పోలీస్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. డబ్బులు ఇప్పించండి పూర్ణానందంపేట: జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో ఇళ్లు ఇప్పిస్తామంటు డబ్బులు వసూలు చేసిన జిలాని నుంచి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. మోసగించిన దళారులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిలానీని పోలీసులు అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌వద్దకు చేరుకుని తమ డబ్బులు ఇప్పించాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బాధితులు ఏప్రాంతంలో ఉంటారో అక్కడ ఫిర్యాదు చేయమనడంతో గురువారం రాత్రి పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పోలీసులు వారిని లోనికి అనుమతించకపోవడంతో తమకు న్యాయం చేయాలని కమిషనరేట్ వద్ద ఆందోళన చేశారు. పోలీసు అధికారులు వారికి నచ్చచెప్పి పంపించారు. -
ఘనంగా జక్కంపూడి జయంతి వేడుకలు
కొరుకొండ: తూర్పుగోదావరి జిల్లా కొరుకొండ మండల కేంద్రంలో గురువారం మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా హెల్త్‌క్యాంప్‌ను వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డెల్టా భూములకు విడతల వారిగా నీరందించడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. డెల్టాకు విడతల వారిగా నీటిని అందించే విధానం గతంలో ఎన్నడూ లేదని గుర్తుచేశారు. ఈ విధానంతో దిగువ ప్రాంత భూములకు సకాలంలో నీరందడం లేదని పేర్కొన్నారు. ఈ విధానాన్ని తక్షణమే ప్రభుత్వం సవరించాలని జ్యోతుల నెహ్రు సూచించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మీ, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. -
కొత్త బస్సులొస్తున్నాయ్..
సాక్షి, విజయవాడ : ఆర్టీసీకి కొత్త బస్సులు వస్తున్నాయి. కేంద్రప్రభుత్వ జేఎన్ఎన్యూఆర్ఎం పథకాన్ని పొడగించి రవాణా వ్యవస్థపై దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా మరో రెండు నెలల్లో ఆర్టీసీకి 90 కొత్త బస్సులు రానున్నాయి. 25 మెట్రో డీలక్స్ బస్సులు, మరో 65 సిటీ ఆర్డనరీ బస్సులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడలో 495 బస్సులు ఉన్నాయి. వీటిలో కాలం చెల్లినవి 40 ఉన్నా అవసరాల దృష్ట్యా కొనసాగిస్తున్నారు. కొత్తవి రాగానే వాటిని తీసివేసి కొత్త రూట్లలో వీటిని నడుపుతారని తెలుస్తోంది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ బస్సులను కేటాయిస్తోంది. వీటికి అయ్యే వ్యయంలో 50శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 30 శాతం ఆర్టీసీ భరిస్తుంది. ఒకొక్క బస్సు సుమారుగా రూ.30 లక్షలు నుంచి రూ.45 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద నగరానికి 213 బస్సులు వచ్చాయి. తర్వాత వీటి మంజూరును ఆపేశారు. ఈ పథకాన్ని పొడిగించి, దేశంలోని కొన్ని ప్రధాన నగరాలకు కొత్త బస్సులు మంజూరు చేస్తున్నట్లు సమాచారం. గుదిబండగా మారిన ‘సీఎన్జీ’ ఆర్టీసీలో 313 సీఎన్జీ బస్సులు ఉన్నాయి. వీటిలో 213 ఎన్యూఆర్ఎం కింద వచ్చినవే. గ్యాస్ కొరత, మరోవైపు బస్సు టైర్లు మన్నిక తగ్గడం, బస్సు నిర్వహణ కూడా పెరగడంతో ఇవి ఆర్టీసీకి గుదిబండగా మారాయి. ఈ సారి ఇచ్చే మెట్రో బస్సులు సీఎన్జీ కాకుండా డీజిల్ మాత్రమే కావాలంటూ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్లు తెలిసింది. మెట్రో బస్సుల నాణ్యత ప్రశ్నర్థకమే మెట్రో బస్సుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. 20 బస్సుల చొప్పున వాటిని మరమ్మతులకు పంపుతున్నారు. ఈ సారి వచ్చే బస్సులపై జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. బస్సుల నాణ్యత పెంచాలంటూ అధికారులు ఆ కంపెనీకి చెప్పినట్లు తెలిసింది. కొత్త రూట్ల కోసం అన్వేషణ వచ్చే బస్సులను కొత్త రూట్లలో తిప్పే అవకాశం ఉంది. జక్కంపూడి, గొల్లపూడి, అంబాపురం సమీపంలో కొత్తగా కాలనీలు ఏర్పడుతున్నాయి. ఆ కాలనీలోకు బస్సుల అవశ్యకతపై ఇప్పటికే అధ్యయనం చేస్తున్నారు. అవసరాన్ని బట్టి సర్వీసులు నడపాలని అధికారులు భావిస్తున్నారు.